తిరుమల శ్రీవారిని ఏపి మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.
వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్న ప్రతి రైతన్న ఆరోగ్యంగా, ఆర్థికంగా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని కోరుకున్నట్లు చెప్పారు.ప్రజా జీవితంలో ప్రజలకు మరింత మేలు చేసేలా జగన్న ఆ దేవుడు దివించాలని వేడుకున్నా అన్నారు.
ప్రతి పక్షం నిద్ర లేస్తే మాటలతో అధికార పార్టీపై యుద్దంకి దిగుతుందన్నారు.ఈ రోజు ప్రతిపక్షం చేస్తున్న దాడులు ఏ ప్రతిపక్షం చేయలేదన్నారు.రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.







