చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యం ఏపీ మంత్రి అంబటి రాంబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సోమవారం పోలవరం పర్యటన చేపట్టారు.

ఈ నేపథ్యంలో గత ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సీరియస్ వేకలు చేశారు.

పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమని అన్నారు.పోలవరాన్ని కేంద్రం నిర్మిస్తామంటే ఆనాడు చంద్రబాబు ఎందుకు అంగీకరించలేదో తెలియజేయాలని డిమాండ్ చేశారు.2018 లోనే పూర్తి చేస్తామని చెప్పి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.కాపర్ డ్యాం నిర్మాణం లేకుండా డయఫ్రం వాల్ ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు.

దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సవాల్ విసిరారు.డయాఫ్రం వాల్ డామేజ్ కావటంపై పలు సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇటీవల వర్షాలు కూరియటం వల్ల వచ్చిన వరదల కారణంగా లోయర్ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి కావడం లేదని అంబాటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నాటి టిడిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలిపారు.

Advertisement

వాళ్లు చేయలేకపోవటానికి ఈరోజు పనులు ఆలస్యంగా జరగటానికి కారణం డయాఫ్రం వాల్ అని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో పవర్ చూపించిన బాబు.. ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధుల విడుదల
Advertisement

తాజా వార్తలు