ఉమ్మడి రాష్ట్రం యొక్క చివరి ముఖ్య మంత్రి గా చరిత్ర లో నిలిచి పోయే కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ) ఇన్నాళ్లు ఏ పార్టీలో ఉన్నాడు అనే విషయాన్ని క్లారిటీ ఇవ్వకుండా వచ్చాడు.2014 అసెంబ్లీ ఎన్నికల సమయం లో హడావిడి చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత కనిపించకుండా పోయిన నేపథ్యం లో ఆయన గురించి రకరకాలుగా ప్రచారం జరిగింది.త్వరలోనే బిజెపి లో ( BJP ) జాయిన్ కాబోతున్నాడు అంటూ చాలా నెలలుగా వార్తలు వస్తున్నాయి.ఎట్టకేలకు ఆ వార్తలను నిజమయ్యాయి.నేడు ఢిల్లీ లో కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో బిజెపి లో జాయిన్ అయ్యాడు.
మాజీ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీ తో కచ్చితంగా ఏపీ బిజెపి( AP BJP ) బలోపేతం అవుతుంది అంటూ ఆ పార్టీ నాయకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.సమైక్య సింహం అంటూ గతంలో పేరు దక్కించుకున్న కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పలు మంచి పనులు చేశారు.వాటిని ప్రచారం చేయడం వల్ల కచ్చితంగా సానుభూతి అనేది కిరణ్ కుమార్ రెడ్డిపై కలిగి బిజెపికి బలం పెరుగుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కానీ కొందరు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి పై ఉన్న నెగిటివిటీ వల్ల బిజెపి కి ఆదరణ తగ్గుతుందా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి బలం పెరగాలి అంటే కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారు ఎంతో మంది పార్టీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏందంటూ విమర్శలు చేస్తున్నారు.మొత్తానికి ఏపీలో బిజెపి లో జోష్ కాస్త పుంజుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి ఉపయోగపడతాడు అనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికలకు వెళ్తే బిజెపికి మరింత బలం అన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు