తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.ఒక్కో బెడ్ పూ ఇద్దరు, ముగ్గురిని పడేయడం ఆరోగ్య తెలంగాణనా అని ఆమె ప్రశ్నించారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో బాలింతలను పొట్టన పెట్టుకోవడమా అని షర్మిల ప్రశ్నించారు.పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి నిధులు ఎగ్గొట్టడమా అని నిలదీశారు.
ఎలుకలు కొరికి రోగులు చనిపోతున్న పట్టింపులేదని, మారుమూల గ్రామాలకు అంబులెన్స్ లు లేవని షర్మిల దుయ్యబట్టారు.ఆరోగ్య తెలంగాణ కాదు.
అనారోగ్య తెలంగాణాగా మార్చారని విమర్శించారు.







