ఇండస్ట్రీలో దర్శకులుగా ఎంతోమంది గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే ఇండస్ట్రీలో మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువగా డైరెక్షన్ రంగంలో కొనసాగుతున్నారు.
ఏ ఒక్కరో, ఇద్దరో మహిళలు మాత్రమే ఇండస్ట్రీలో దర్శకులుగా కొనసాగుతున్నారనే విషయం మనకు తెలిసిందే.అయితే ఇప్పటికే లక్ష్మీ సౌజన్య, సుధా కొంగర, నందిని రెడ్డి వంటి లేడీ డైరెక్టర్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
అయితే మరి కొద్ది రోజులలోనే మరో లేడీ డైరెక్టర్(Lady Director) ఇండస్ట్రీకి పరిచయం కాబోతుందని తాజాగా యంగ్ హీరో నితిన్(Nithin) సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఇలా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న మరో లేడీ డైరెక్టర్ ఎవరో కాదు స్వయంగా సమంత(Samantha) స్నేహితురాలు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజకోన(Neeraja Kona) ఇండస్ట్రీకి దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు.ఈమె 2013 వ సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమా ద్వారా కాస్ట్యూమ్ డిజైనర్(Custom designer) గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఇలా ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న ఈమె అనంతరం పాటలకు లిరిక్స్ రాస్తూ కూడా ఇండస్ట్రీకి సేవలు చేశారు.
అయితే త్వరలోనే ఈమె దర్శకురాలిగా కూడా పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని నితిన్ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ నీరజ కోన డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వడం తనకు సంతోషంగా ఉందని చెప్పడమే కాకుండా స్క్రిప్ట్ కూడా ఎంతో అద్భుతంగా ఉందని తెలిపారు.ఇలా నితిన్ స్క్రిప్ట్ కూడా అద్భుతంగా ఉందని తెలియజేయడంతో బహుశా నీరజ కోన దర్శకత్వంలో నితిన్ తన తదుపరి ప్రాజెక్టు చేయబోతున్నారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే త్వరలోనే దీని గురించి అధికారక ప్రకటన వెలబడుతుంది.
ఇకపోతే నీరజ కోన సమంతకు కాస్త డిజైనర్ గా మాత్రమే కాకుండా ఎంతో మంచి స్నేహితురాలు అనే విషయం మనకు తెలిసిందే.