ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపే ఇంటర్ ఫలితాలు( Inter results tomorrow ) విడుదల కానున్నాయి.తాజాగా ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన చేయడం జరిగింది.
రేపు అనగా బుధవారం సాయంత్రం ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్ర ఇంటర్ బోర్డు స్పష్టం చేయడం జరిగింది.ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ 5.19 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది.మొదటి సంవత్సరానికి చెందిన 4.84 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1489 పరీక్షా కేంద్రాలలో.
విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది.
మార్చి 15వ తారీకు తేదీన ఇంటర్మీడియట్ ఫస్టియర్… 16వ తారీఖున ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్… స్టార్ట్ కాగా ఏప్రిల్ 4వ తారీఖున పరీక్షలు ముగిశాయి.దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు.ఈ క్రమంలో రేపు సాయంత్రం ఐదు గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి శేషగిరిరావు వెల్లడించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana )విజయవాడలో సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారని తెలిపారు.విద్యార్థులు bieap.apcfss.in.ap.అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.