ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు( AP Inter Results ) విడుదల అయ్యాయి.పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే ఫలితాలను ఇంటర్ విద్యామండలి( Inter Board ) వెల్లడించింది.
ఈ మేరకు తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్( Inter Board Secretary Saurabh Gaur ) ప్రకటించారు.
ఇంటర్ మొదటి సంవత్సరంలో విద్యార్థులు 67 శాతం ఉత్తీర్ణత సాధించగా.
ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 78 శాతం ఉత్తీర్ణత సాధించారు.ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 84 శాతంతో కృష్ణా జిల్లా( Krishna District ) మొదటి స్థానంలో ఉంది.
రెండో స్థానంలో గుంటూరు, మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు నిలిచారని ఆయన తెలిపారున.ఈ క్రమంలోనే అనుకున్న ఫలితాలు పొందలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందవద్దని ఆయన సూచించారు.
అదేవిధంగా రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 18 నుంచి 24 వ తేదీ వరకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.అయితే మార్చి ఒకటి నుంచి 20 తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించగా.ఈ పరీక్షలకు మొత్తం 9.99 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారన్న సంగతి తెలిసిందే.







