ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు( AP Inter Results ) విడుదల అయ్యాయి.

పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే ఫలితాలను ఇంటర్ విద్యామండలి( Inter Board ) వెల్లడించింది.

ఈ మేరకు తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్( Inter Board Secretary Saurabh Gaur ) ప్రకటించారు.

ఇంటర్ మొదటి సంవత్సరంలో విద్యార్థులు 67 శాతం ఉత్తీర్ణత సాధించగా.ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 78 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 84 శాతంతో కృష్ణా జిల్లా( Krishna District ) మొదటి స్థానంలో ఉంది.

రెండో స్థానంలో గుంటూరు, మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు నిలిచారని ఆయన తెలిపారున.

ఈ క్రమంలోనే అనుకున్న ఫలితాలు పొందలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందవద్దని ఆయన సూచించారు.

అదేవిధంగా రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 18 నుంచి 24 వ తేదీ వరకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

అయితే మార్చి ఒకటి నుంచి 20 తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించగా.

ఈ పరీక్షలకు మొత్తం 9.99 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారన్న సంగతి తెలిసిందే.

పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన