సమాచారం తెలుసుకోలేదు...సాగనంపాడు

ప్రభుత్వాలు ఎప్పుడు ఏ అధికారులను అందలమెక్కిస్తాయో, ఎప్పుడే ఏ అధికారిని కిందకు నెడుతుందో, ఎప్పుడు ఎవరిని బదిలీ చేస్తారో, ఎప్పుడు ఎవరిని లూప్‌ లైన్లో పెడతారో తెలియదు.

ముఖ్యమంత్రితో నేరుగా సంబంధాలు (ఉద్యోగరీత్యా) ఉండే ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల జీవితాలు ప్రతి క్షణం టెన్షన్‌గానే ఉంటాయి.

వాళ్లు ఉన్నత పదవుల్లో ఉన్నారని, వారికేం తక్కువైందని మనం అనుకుంటాంగాని ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతుంటారు.నోటుకు ఓటు కుంభకోణం జరిగి నెల రోజులు దాటిపోయింది.

ఇందులో నిందితుడైన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి బెయిల్‌పై బయటకు కూడా వచ్చాడు.జరిగిన ఘటన తెలంగాణకు సంబంధించింది.

అయినప్పటికీ ఇందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సూత్రధారిగా ఉన్న సంగతి తెలుసు.తప్పు చేసింది రేవంత్‌ రెడ్డి, అలా చేయాలని చెప్పిన వ్యక్తి చంద్రబాబు.

Advertisement

అయినప్పటికీ బాబు మహిళా ఐపీఎస్‌ అధికారిని బలి చేశారు.బలి అంటే ఉద్యోగం నుంచి తీసేయడం కాదు.

బదిలీ చేశారు.నిఘా (ఇంటలిజెన్‌్స) విభాగానికి అధిపతిగా నియమితురాలైన మొట్టమొదటి మహిళా ఐపీఎస్‌ అధికారి ఏఆర్‌ అనూరాధ.

చంద్రబాబు ఈమెను విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్‌్సమెంట్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా నియమించి ఆమె స్థానంలో విజయవాడ పోలీసు కమిషనర్‌ ఏబీ వెంకటేవ్వరరావును నియమించారు.అనూరాధను చంద్రబాబు ఎందుకు బదిలీ చేశారంటే.

నోటుకు ఓటు ఎపిసోడ్‌ను ఆమె ముందుగా పసిగట్టలేకపోయిందట.! రేవంత్‌ రెడ్డి వెళ్లి స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇస్తాడని, ఆయన ఏసీబీకి చెప్పి కెమెరాలు పెట్టి ఇదంతా చిత్రీకరిస్తారని ఆమె తెలుసుకోలేకపోవడంతో బాబుకు ఆమె పనితీరు నచ్చలేదు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!

ఆమె విధి నిర్వహణలో విఫలమయ్యారని భావించి ఆమెపై బదిలీ వేటు వేశారు.రేవంత్‌ రెడ్డి నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ దగ్గరకు వెళుతున్న విషయం అనూరాధకు ముందుగా చెప్పాల్సిందేమో.! ఇంటలిజెన్‌్స ఉన్నది అవినీతి నాయకులను రక్షించడానికా? నాయకుల తప్పుడు పనులకు అధికారులు బలవుతున్నారు.గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఐఏఎస్‌ అధికారులను బలి చేశారు కదా.!.

Advertisement

తాజా వార్తలు