స్వామీజీకి ఏపీ ప్రభుత్వ నజరానా...!

ప్రభుత్వ భూముల కోసం వెంపర్లాడేది పారిశ్రామికవేత్తలు, బడా పెట్టుబడిదారులు, విదేశీ ఇన్వెస్టర్లే కాదు, భక్తి తత్వాన్ని బోధించే స్వామీజీలు కూడా.

ఉమ్మడి రాష్ర్టంలో ఎందరో స్వామీజీలు ఎకరాల కొద్దీ ప్రభుత్వ స్థలాలు తీసుకొని హైదరాబాద్‌ శివార్లలో పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మించుకున్నారు.

సామాన్య ప్రజలకు, పేదలకు ఏదైనా మేలు చేయాలంటే వెనకాముందాడుతూ సవాలక్ష నిబంధనలు పెట్టే ప్రభుత్వాలు స్వామీజీలు కోరిన వెంటనే వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా ఇచ్చేస్తుంటాయి.వారేమైనా పరిశ్రమలు పెట్టి దేశాభివృద్ధికి పాటుపడతారా? లేదు.ఆశ్రమాలు కట్టుకొని భక్తుల చేత సేవలు చేయించుకుంటూ, టీవీల్లో ఉపన్యాసాలు ఇస్తూ కాలం గడిపేస్తుంటారు.

తాజాగా ప్రసిద్ధ స్వామీజీ జగ్గీ వాసుదేవ్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు భారీ నజరానా సమర్పించబోతున్నారు.రాష్ర్టంలో వాసుదేవ్‌ ఆశ్రమం నిర్మించుకునేందుకు నాలుగొందల ఎకరాల అటవీ భూమిని అప్పగించబోతున్నారు.

జగ్గీవాసుదేవ్‌ తమిళనాడులోని కోయంబత్తూరు దగ్గర ఈశా ఫౌండేషన్‌ పేరుతో విశాలమైన స్థలంలో ఆశ్రమం నిర్మించారు.ఇప్పుడు ఏపీ వైపు దృష్టి సారించారు.బాబుకు జగ్గీ వాసుదేవ్‌ పట్ల ఆపారమైన భక్తి ప్రపత్తులు ఉన్నాయేమో.

Advertisement

స్వామీజీలకు అపారమైన సంపద ఉంటుంది.జాగా కొని ఆశ్రమం కట్టుకోలేరా? అయినా ఆశ్రమానికి నాలుగొందల ఎకరాలా? .

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు