దేశ విదేశాల్లో ఉద్యోగాలో లేదా చదువుకోసమో వెళ్ళిన విద్యార్ధుల కోసం ఏపీ ప్రభుత్వం ఒక భీమా పధకాన్ని అమలు చేస్తోంది.అయితే ఈ భీమా పధకం ఉపయోగించుకోవడంలో మాత్రం ప్రవాసులు వెనుకబడుతున్నారని అసలు ఈ పధకం విషయంలో స్పందన కోరవైందని తెలుస్తోందని అధికారులు తెలుపుతున్నారు.
ఈ పథకం గురించి ఎన్ఆర్‌ఐ కుటుంబాలకు సరైన అవగాహన లేకపోవడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాసుపోర్టు నంబర్ నమోదు చేయాల్సి ఉండటంతో వెనకగడుగు వేస్తున్నారు.
అయితే గత ఏడాది ప్రారంభం అయిన ఈ స్కీం ని ప్రజలలోకి తీసుకువెళ్ళడం లో కానీ ప్రవాసులు కానీ అసలు దృష్టి చూపడంలేదని తెలుస్తోంది.ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ స్కీం ని ఉపయోగించుకోవచ్చు అయితే ఈ స్కీం గురించి అవగాహన కల్పించక పోవడం వలన ఈ పధకం నీరు కారిపోతోంది.విదేశాలలో ఎన్నారైలకి ప్రమాదాలు జరిగినప్పుడు వారిని ఇండియా కి తీసుకుని రావడానికి ఎంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి.అయితే
ఈ విషయాలని పరిశీలించిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా పథకాన్ని ప్రత్యేకించి అమలులోకి తీసు కొచ్చింది.ఉద్యోగులు.విద్యార్థులకు వేర్వరుగా పథకాన్ని అమలు చేస్తోంది.నామమాత్రపు ప్రీమియంతోనే ప్రవాసాంధ్రులు ఈ స్కీం కింద ధరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది.
ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.ఉద్యోగుల వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.ఇన్సూరెన్స ప్రీమియం ఒక్కో సభ్యుడికి రూ.150 చెల్లించాలి.
అయితే ప్రతీ మూడేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేయించుకోవాలి.ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షల బీమా చెల్లిస్తారు.బీమా చేయించుకొన్న వ్యక్తి అనారోగ్యం పాలైనా లేక ప్రమాదంలో గాయపడినా ఆ వ్యక్తికి, ఒక సహాయకుడికి ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు.గర్భిణులకు రూ.35 వేలు సాధారణ కాన్పు, సిజేరియన్‌కు అయితే రూ.50 వేలు చెల్లిస్తారు.చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సంవత్సరానికి రూ.50 వేలు వైద్య ఖర్చులకు చెల్లిస్తారు.ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి లిటిగేషన ఉన్నా రూ.45 వేలు సహాయనిధి చెల్లిస్తారు.
అలాగే విద్యార్థి వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్యన ఉండాలి.
బీమా కాలం ఏడాదిగా నిర్ణయించారు.ఈ సంవత్సరానికి రూ.75 ప్రీమియంగా చెల్లించాలి.విద్యార్థి ప్రమాదవశాత్తు చనిపోయినా/శాశ్వత అంగ వైకల్యం ఏర్పడినా రూ.10 లక్షలు చెల్లిస్తారు.చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకు రావడానికి, అంగవైకల్యం పొందిన వ్యక్తికి, ఒక సహాయకుడికి ఎకానమీ క్లాస్ విమాన టిక్కెట్‌కు అయ్యే ఖర్చుని రీయింబర్స్ చేసుకోవచ్చు.
రోడ్డు ప్రమాదంలో గాయపడితే హాస్పిటల్ ఖర్చులకు రూ.లక్ష చెల్లిస్తారు
.