టిడిపి ,జనసేన, బిజెపి పొత్తు( TDP Janasena BJP Alliance )లో భాగంగా జనసేన 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే విధంగా ఒప్పందం చేసుకుంది.కొన్ని నియోజకవర్గాల విషయంలో ముందుగానే క్లారిటీ రావడంతో , అభ్యర్థుల జాబితాను ప్రకటించగా మరికొన్ని నియోజకవర్గాలను ఇప్పటి వరకు పెండింగ్ లో పెట్టారు.
బిజెపి, టిడిపి ల మధ్య సీట్ల పంపకాల విషయంలో ఒక క్లారిటీ రావాల్సి ఉండడం , ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు జనసేనకు లేకపోవడం తదితర కారణాలతో కొన్ని నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టారు.అయితే పూర్తి స్థాయిలో 21 అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలకు( Parliament Seats ) అభ్యర్థులను జనసేన ప్రకటించింది.జనసేన అభ్యర్థుల పూర్తి జాబితా ఒకసారి పరిశీలిస్తే…
పాలకొండ నిమ్మక జయకృష్ణ, నెల్లిమర్ల లోకం మాధవి, విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్, పిఠాపురం పవన్ కళ్యాణ్, అనకాపల్లి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, నిడదవోలు కందుల దుర్గేష్, పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ, రాజోలు దేవి వరప్రసాద్, తాడేపల్లిగూడెం బోలిశెట్టి శ్రీనివాస్, భీమవరం పులపర్తి రామాంజనేయులు, నరసాపురం బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు ధర్మరాజు ,పోలవరం చిర్రి బాలరాజు( Polavaram Chirri Balaraju ), అవనిగడ్డ మండలి బుద్ధ ప్రసాద్, తెనాలి నాదెండ్ల మనోహర్, తిరుపతి ఆరాని శ్రీనివాసులు, రైల్వే కోడూరు అరవ శ్రీధర్.</br>
ఇక రెండు పార్లమెంట్ నియోజకవర్గాల విషయానికొస్తే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ శ్రీనివాస్, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా బాలసౌరి పోటీ చేస్తున్నారు.ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అలాగే కూటమి తరపున ప్రచారం నిర్వహిస్తూనే టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu ) తో కలసి వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రోడ్ షో లు, బహిరంగ సభల్లో పాల్గొంటూ జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.