ఏపి పంచాయతీ ఎన్నికలు అక్కడ హాట్ టాపిక్ గా మారాయి రోజుకో న్యూస్ తో అసలు ఎన్నికలు జరుగుతాయి లేదా అనుమానంలో రాష్ట్ర ప్రజలు, నాయకులు ఉన్నారు.అయిన కానీ ఇప్పటికి అక్కడ పంచాయతీ ఎన్నికలపై సరైన స్పస్టత లేదు.
సుప్రీం కోర్టు వరకు వెళ్ళిన ఏపి ఎన్నికలు, కోర్టు పంచాయతీ ఎన్నికల నిర్వహణ కు అనుకూలంగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రీ షెడ్యూల్ చేసి నోటిఫికేషన్ ను విడుదల చేశాడు.ఈ క్రమంలో నేడు రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో వీడియో కాన్ఫ్రెన్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.ఎన్నికల విషయమై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు భద్రత పరమైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటూ విలేకరులు ప్రశ్నించగా.
రాష్ట్రలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను జిల్లా ఎస్‌పి లు గుర్తించారు భారీ బందోబస్తు నడుమ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాం అని చెప్పాడు.అలాగే ఒకేసారి ఎన్నికలు, పోలీసుల కు కరోనా వ్యాక్సిన్ అందించే విషయంలో ఇబ్బందులు రావొచ్చు అనే విషయంపై నిర్ణయం ఇంకా రావలిసి ఉంది.
త్వరలో వస్తుందని ఆశిస్తున్న అన్నారు.
.