తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ

తిరుమల శ్రీవారిని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ దర్శించుకున్నారు.

వేకువజామున స్వామి వారి అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న సమీర్ శర్మకు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు.అభిషేక సేవ అనంతరం రంగనాయకుల మండపంలో సమీర్ శర్మకు వేదపండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు.

పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

తాజా వార్తలు