ఏపీలో అమ్ముతున్న మద్యం బ్రాండ్స్ పై గత కొన్నాళ్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.కమీషన్స్‌కు కక్కుర్తి పడి కల్తీ మద్యంను, నాసిరకం మద్యంకు ప్రభుత్వం అనుమతించిందని, ఇలాంటి మద్యం ఎక్కడ చూడలేదు, దీన్ని వారం రోజులు తాగితే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే.
దమ్ముంటే ఈ మద్యంను వారం రోజుల పాటు వైకాపా నాయకులు మంత్రులు తాగుతారా అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఛాలెంజ్ చేస్తున్నారు.వారి విమర్శలపై వైకాపా నాయకులు తమదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు.
దేశంలో ఎన్నో రాజకీ పార్టీలు ఉన్నాయి.ఆ పార్టీల నాయకులు ఎంతో మంది ప్రభుత్వాలపై విమర్శలు చేస్తారు.కాని ఇలా మద్యం గురించి, వాటి బ్రాండ్స్ గురించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే పార్టీ తెలుగు దేశం పార్టీ మాత్రమే అంటున్నారు.రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.
ఒక వైపు ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతున్న ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ వారు మద్యం బ్రాండ్స్ గురించి రచ్చ చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అంటూ వైకాపా నాయకులు ప్రతి విమర్శలు చేస్తున్నారు.