ఏపీ కరోనా అప్‌డేట్స్.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులంటే.. ?

కరోనా. ప్రస్తుతం అన్నీ మరచి ఈ పేరును పదే పదే తలచుకునే రోజులు వచ్చాయి.

మరి ఈ కోవిడ్ వల్ల ప్రజలు భయపడుతున్నారా? అంటే చాలమందిలో భయం తగ్గిందని చెప్పవచ్చూ.ఇకపోతే ఈ మధ్య కాలంలో కరోనా వ్యాపిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే.

ఒక విధంగా గతేడాది ఇదే సమయంలో కరోనా వ్యాప్తి తీరుతెన్నులు ఎలా ఉన్నాయో, ప్రస్తుత పరిస్థితులు కూడా అదే రీతిలో కొనసాగుతున్నాయని చెప్పవచ్చూ.ఈమేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 30,678 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1,326 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని వీటితో కలిపి ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 10,710కి చేరిందని పేర్కొంది.

ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లాలో 282 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, విశాఖ జిల్లాలో 222, నెల్లూరు జిల్లాలో 171, గుంటూరు జిల్లాలో 271, కృష్ణా జిల్లాలో 138 కేసులు నమోదయ్యాయని, అత్పల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 2 కేసులు గుర్తించినట్లు వెల్లడించారు అధికారులు.ఇదే సమయంలో రాష్ట్రంలో 911 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించడంతో కరోనా మృతుల సంఖ్య మొత్తం 7,244కి చేరిందని, ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 9,09,002 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,91,048 మంది కోలుకున్నట్లుగా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement
వైట్ హౌస్ గేట్‌ను ఢీకొట్టిన వ్యక్తి.. కట్ చేస్తే మృతి..?

తాజా వార్తలు