ఏపీలో దూకుడు పెంచిన కాంగ్రెస్ .. లోక్ సభ స్థానాల ఇన్చార్జీలు వీరే 

ఏపీలో కాంగ్రెస్ ను( AP Congress ) బలోపేతం చేసే విధంగా ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.

ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో, ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దింపే విధంగా ప్రయత్నాలు చేస్తుంది.

ప్రధానంగా వైసీపీ, టీడీపీ, జనసేన ల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో తాము కూడా రంగంలోకి దిగాలని నిర్ణయించుకుంది.ఇప్పటికే వైస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి గా ఉన్న వైఎస్ షర్మిలను( YS Sharmila ) కాంగ్రెస్ లో చేర్చుకున్నారు.

ఆమె వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు.ఇక పార్టీలో పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు.

వైసిపి లోని అసంతృప్తి నాయకులు పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరుతానని ఆశలతో ఉన్నారు.

Advertisement

వైసిపి ( YCP ) ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక మొదలుపెట్టింది.మొదటి విడతలో ౧౧, రెండో విడతలు 38 మంది పేర్లను ప్రకటించింది.మూడో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతుండగా, టిడిపి( TDP ) సైతం అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది తమ మిత్రపక్షంగా ఉన్న జనసేనతో( Janasena ) సీట్ల పంపకాల పైన దృష్టి పెట్టింది.

ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ సైతం అంతే స్థాయిలో దూకుడు పెంచాలని నిర్ణయించుకుంది.రాష్ట్రంలోని అన్ని లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమిస్తూ జాబితా విడుదల చేసింది.

ఏపీతోపాటు.తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గడ్ ,పంజాబ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలకు కొత్తగా ఇన్చార్జిలను నియమించింది.

ఏపీలో అరకు జగత శ్రీనివాస్,( Jagatha Srinivas ) శ్రీకాకుళం మీసాల సుబ్బన్న,( Meesala Subbanna ) విజయనగరం బొడ్డేపల్లి సత్యవతి, విశాఖపట్నం కొత్తూరు శ్రీనివాస్, అనకాపల్లి సనపల అన్నాజీ రావు, కాకినాడ కేబిఆర్ నాయుడు, అమలాపురం వెంకట శివప్రసాద్ ,రాజమండ్రి ముసిన రామకృష్ణ ,నరసాపురం జెట్టి గురునాథరావు,ఏలూరు కనుమూరి బాపిరాజు, మచిలీపట్నం కొరివి వినయ్ కుమార్, విజయవాడ డాక్టర్ మురళీమోహన్ రావు, గుంటూరు గంగిశెట్టి ఉమాశంకర్, నరసరావుపేట వి గురునాథం, బాపట్ల శ్రీపతి ప్రకాశం, ఒంగోలు యు వెంకట్రావు యాదవ్ లను నియమించింది.నంద్యాల బండి జకారియా, కర్నూలు పీఎం కమలమ్మ, అనంతపురం ఎన్ శ్రీహరి ప్రసాద్, హిందూపురం షేక్ సత్తార్, కడప, నెల్లూరు ఎం రాజేశ్వరరావు, తిరుపతి షేక్ నజీర్ అహ్మద్, రాజంపేట డాక్టర్ ఎన్ తులసి రెడ్డి, చిత్తూరు రాంభూపాల్ రెడ్డి ల ను ఇన్చార్జిలుగా నియమించారు.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు