విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెమీ క్రిస్మస్ ( Semi Christmas )వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy )హాజరు కావడం జరిగింది.
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
క్రిస్మస్ సందర్భంగా సీఎం జగన్ కేక్ కట్ చేయడం జరిగింది.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ… దేవుని విషయంలో మనుషుల పట్ల ప్రేమ చూపించడం, నిస్సహాయుల పట్ల కరుణ చూపించటం, ఆకాశమంత సహనం ప్రతి మనిషిలో కూడా అలవాటు చేసుకోవటం.
అవధులు లేని త్యాగం మరి ముఖ్యంగా శత్రువుల పట్ల క్షమాగుణం.ఇవన్నీ కష్టమైన విషయాలైనప్పటికీ కూడా.వాటిని పాటిస్తూ జీవిస్తామో.దేవుడికి నచ్చే బిడ్డలుగా మనందరం ఉంటాం.
అటువంటి మనసు దేవుడు అందరికీ ఇవ్వాలని, రాష్ట్రాన్ని ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని.మనసారా కోరుకుంటున్నాను.
క్రిస్మస్ సందర్భంగా.తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా క్రిస్మస్( Christmas ) శుభాకాంక్షలు.
అని సీఎం జగన్ ప్రసంగించడం జరిగింది.అనంతరం కొవ్వొత్తుల వెలిగించి క్రిస్మస్ కేక్ కట్ చేయడం జరిగింది.
ఇక ఇదే సమయంలో పలు రంగాలలో విశేష కృషి చేసిన వారికి సీఎం జగన్ అవార్డులను అందజేయడం జరిగింది.