ఏపి ముఖ్యమంత్రి జగన్ యజ్ఞోపవీతం వేసుకుని హిందువులా నటించే పరమతానికి చెందిన మోసగాడు అన్నారు టిడిపీ నేత బోండా ఉమా.ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉమా.ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సతీసమేతంగా ఇప్పటివరకూ హిందూ దేవాలయాన్ని సందర్శించని హిందువులా నటించే మోసగాడు జగన్ అన్నారు.నేడు రాష్ట్రంలో అవినీతి పరిపాలన రాజ్యం ఏళుతుంది అనీ, అమ్మాయిలపై, మహిళలపై దాడులు పెరిగిపోయాయి అని మండిపడ్డారు.
క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం ఏపి క్రైమ్ లో ఉన్నత స్థానంలో వుండటం సిగ్గుచేటు అన్నారు.త్వరలో ఈ అక్రమ, అవినీతి పరిపాలనకు స్వస్తి పలకాలి అని శ్రీవారిని ప్రార్థించాను అన్నారు బోండా.