యాంకర్: తిరుమల శ్రీవారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, తిరుపతి ఎంపీ గురుమూర్తి దర్శించుకున్నారు.ఈ ఉదయం విఐపి విరామ సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు.
టిటిడి అధికారులు దగ్గరవుండి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల స్పీకర్ తమ్మినేనిని మిడియా ప్రతినిధులు రాష్ట్ర రాజకీయాలు పై ప్రశ్నించగా ఆయన నిరాకరించారు.







