ఆగష్టు 18 వరకు ఖమ్మం రూరల్ మండలంలో 144 సెక్షన్ యధావిధిగా అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ తెలిపారు ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి లో తమ్మినేని కృష్ణయ్య హత్య ఘటన నేపథ్యంలో ఆగష్టు 18 సాయంత్రం 6:00 గంటల వరకు 144 సెక్షన్ ఆంక్షలు అమలుల్లో వుంటుందని తెలిపారు.ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించరాదని, గుంపులుగా తిరగడం నిషేధమని తెలిపారు.నిషేధం వున్న నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు.







