న్యూస్ రౌండప్ టాప్ 20

1.సూపర్ పవర్ గా ఇండియా

 ప్రపంచ సంక్షేమానికి పాటుపడే సూపర్ పవర్ గా నిలవాలని భారతదేశం కోరుకుంటోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు.

 

2.మాచర్లలో కొనసాగుతున్న 144 సెక్షన్

 

మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది.టిడిపి వైసిపి మధ్య వివాదం చోటు చేసుకోవడంతో భారీగా పోలీసు బలగాలను అక్కడ మోహరించారు. 

3.ఢిల్లీ ఫోనిక్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

  దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఫోనిక్స్ ఆసుపత్రిలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ పార్ట్ వన్ లోని ఫోనిక్స్ ఆసుపత్రి బేస్మెంట్ లో శనివారం ఉదయం 9 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. 

4.ఢిల్లీ చేరుకున్న అమరావతి రైతులు

 

అమరావతి రాజధాని కోసం రైతులు ఆందోళన కొనసాగుతోంది .అమరావతి ఉద్యమంలో భాగంగా ఈరోజు ఉదయం దాదాపు 200 మంది రైతులు ప్రత్యేక రైలు లో ఢిల్లీకి చేరుకున్నారు.జంతర్ మంతర్ వద్ద ఈరోజు ఆందోళన చేయనున్నారు. 

5.ఢిల్లీకి వచ్చిన రాహుల్

 రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర 100వ రోజుకు చేరుకుంది.కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం రాజస్థాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. 

6.బండి సంజయ్ కు రోహిత్ రెడ్డి సవాల్

 

Advertisement

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ చేశారు.ఈరోజు చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ కు ఎమ్మెల్యే వెళ్ళనున్నారు .బెంగళూరు డ్రగ్స్ కేసులో తనకు సంబంధం ఉన్నట్టు సంజయ్ చేసిన వ్యాఖ్యలను రోహిత్ తీవ్రంగా ఖండించారు.యాదగిరిగుట్ట ఆలయంలో తడి బట్టలతో ప్రమాణం చేద్దాం రా అంటూ సంజయ్ కు రోహిత్ సవాల్ విసిరారు. 

7.విజయవాడలో సిఎన్జి బస్సు దగ్ధం

  విజయవాడ విద్యాధరపురం బస్సు డిపోలో సిఎన్జి బస్సు అగ్నికి ఆహుతి అయింది.మరో రెండు బస్సులు పాక్షికంగా దగ్ధం అయ్యాయి.బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు తెలిపారు. 

8.ముజా ఫర్ పూర్ నుంచి బెంగళూరుకు ప్రత్యేక రైలు

 

ముజఫర్ పూర్ నుంచి బెంగుళూరుకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు తూర్పు రైల్వే ప్రకటించింది. 

9.టిడిపి నేతలు మాచర్ల వెళ్లకుండా ఆంక్షలు

  టిడిపి నేతలు మాచర్ల వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.అక్కడ వైసిపి టిడిపి మధ్య వివాదం చోటు చేసుకోవడమే దీనికి కారణం. 

10.తిరుమల సమాచారం

 

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.శ్రీవారి దర్శనం కోసం ఒక కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. 

11.51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు : మంత్రి గంగుల

  రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 

12.పెరిగిన సిఎన్జి ధర

 

దేశవ్యాప్తంగా సిఎన్జి ధరను పెంచుతున్నట్లు ఇండస్ట్రియల్ గ్యాస్ లిమిటెడ్ ప్రకటించింది.హైదరాబాద్ లో ప్రస్తుతం సిఎన్జి కేజీ ధర 95 గా ఉంది.నెల రోజుల వ్యవధిలో 3 రూపాయలు పెరిగింది. 

13.గుంటూరు డిఐజికి చంద్రబాబు ఫోన్

  గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో తీవ్రత నెలకొంది .టిడిపి నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు.ఈ ఘటనపై డిఐజి కి టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్ చేశారు.బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

14.హెటీరో ల్యాబ్స్ లో చిరుత కలకలం

 

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

సంగారెడ్డి జిల్లా జన్నారం మండలం గడ్డి పోచారం పారిశ్రామిక వాడలోని హెటిరో పరిశ్రమలో చిరుత సంచారం కలకలం రేపింది.హెచ్ బ్లాక్ లో చిరుత దాగి ఉండడంతో ఉద్యోగులు భయాందోళనతో పరుగులు తీశారు. 

15.ఏపీ హైకోర్టులో అత్యధిక కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్

  దేశంలో అత్యధిక కోర్టు ధిక్కరణ కేసులు ఏపీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి.స్వయంగా ఈ విషయాన్ని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 

16.సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు

 

Advertisement

నేటి నుంచి జనవరి 1 వరకు సుప్రీంకోర్టు కు శీతాకాల సెలవులు. 

17.నేడు విజయనగరం లో గవర్నర్ పర్యటన

  ఏపీ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ ఈరోజు విజయనగరం రానున్నారు .సెంచూరియన్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొనబోతున్నారు. 

18.నేడు ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

 

నేడు ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగనుంది .దీనికి ముఖ్య అతిథులుగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రముఖ వ్యాపారవేత్త జిఎంఆర్ హాజరుకానున్నారు. 

19.నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం

  నేడు బట్టి విక్రమార్క నివాసంలో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు.పిసిసి కమిటీ వివాదంపై చర్చించనున్నారు. 

20.బంగారం ధరలు

 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,950   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 54,490.

తాజా వార్తలు