పార్టీలో అంతా తన వాళ్లే ఉండాలనుకోవడం సరికాదని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి ఉద్దరిస్తారా అని ప్రశ్నించారు.
కొత్త కమిటీల్లోని 108 మందిలో 54 మంది టీడీపీ వాళ్లేనని తెలిపారు.అసలైన కాంగ్రెస్ నేతలకు కావాలనే సామాజిక మాధ్యమాల్లో బద్నాం చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్న ఆయన సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్లామని స్పష్టం చేశారు.







