న్యూస్ రౌండప్ టాప్ 20

1.చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు.

2.జగన్ కామెంట్స్

ప్రజలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్న దుర్మార్గుల విషయంలో ఎటువంటి మొహమాటలు వద్దని,  చట్టాన్ని , ప్రజలకు మంచి రక్షణ కల్పించే పోలీసులపై దాడికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఏపీ సీఎం జగన్ అన్నారు.

3.చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల

స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ అయి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.చంద్రబాబుకు ఎనిమిది రకాల వైద్య పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు.

4.జిపిఎస్ అమలు బిల్లుకి గవర్నర్ ఆమోదం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జిపిఎస్ అమలు బిల్లుకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు.

5.విద్యాశాఖలు స్కాం లు జరిగాయి : జనసేన

పేదలకు న్యాయమైన విద్య పేరుతో ప్రభుత్వ ఖజానాకు భారంగా మారే ఒప్పందాలు జగన్ ప్రభుత్వం చేసుకుంటుందని జనసేన పి ఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

6.కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తూ ఉత్తర్వులు

ఏపీలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

7.భూకబ్జాలపై సిఐడికి ఏపీ ప్రభుత్వం రిఫర్

Advertisement

ప్రకాశం జిల్లాలో భూ కబ్జాల వ్యవహారంపై సిఐడికి ఏపీ ప్రభుత్వం రిఫర్ చేయనుంది అని  మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

8.రాహుల్ గాంధీకి కవిత రిక్వెస్ట్

మరొక్కసారి రాహుల్ గాంధీ జీవన్ రెడ్డి ఇలా దిగజారి మాట్లాడొద్దని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిక్వెస్ట్ చేశారు.

9.బిజెపి అభ్యర్థుల ఎంపికపై లక్ష్మణ్ కామెంట్

బిజెపి అభ్యర్థుల ఎంపికలు సామాజిక న్యాయం పాటించామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

10.రేపు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ లో సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లుంబిని పార్కు ,  ట్యాంక్ బండ్  లలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ కాంక్షలు , ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్  సి పి సుధీర్ బాబు తెలిపారు.

11.గజ్వేల్ నియోజకవర్గం పై కేసీఆర్ కామెంట్స్

గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తం ప్రతినెల ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

12.హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావు

హైదరాబాద్ , ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ ఎన్నికల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏ జగన్మోహన్ రావు  ఎన్నికయ్యారు.

13.అచ్చెన్న నాయుడు కామెంట్స్.

జనసేనతో కలిసి టీడీపీ 160 సీట్లు సాధించబోతున్నాయి అని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అన్నారు.

14.ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి హడావుడి

ట్యాంక్ బండ్ నుంచి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేశారు .సీఎం కేసీఆర్ ను సమర్థించి తప్పు చేశానని మోత్కుపల్లి  పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

15.మాజీ మంత్రి తుమ్మల విమర్శలు

త్వరలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా.. ఆ వివాదంపై జానీ మాస్టర్ క్లారిటీ ఇదే!
కిరణ్ అబ్బవరంకు పరోక్షంగా అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారా.. అసలేం జరిగిందంటే?

దుర్మార్గ పాలన అంతానికే తాను బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు.

16.లోకేష్ సంచలన కామెంట్స్

తన తల్లి భువనేశ్వరి పై కేసు పెడతామని సిఐడి బెదిరించిందని ,  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

17.టిడిపి విస్తృతస్థాయి సమావేశం

Advertisement

టిడిపి అధినేత చంద్రబాబు లేకుండా టిడిపి రాష్ట్ర విస్తృత సమావేశం ఈరోజు జరిగింది.

18.ప్లాగ్ డే

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో ఫ్లాగ్ డే నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో డిజిపి అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

19.దసరా సెలవుల్లో మార్పులు

జేఎన్టీ  యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు దసరా సెలవుల షెడ్యూల్ లో మార్పులు చేస్తూ ప్రిన్సిపల్ విజయ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు.షెడ్యూల్ ప్రకారం ఈనెల 22 నుంచి 24 వరకు దసరా సెలవులు కాగా , పండుగ సెలవులను 25 వరకు పొడిగించారు.

20.పట్టాలెక్కిన నమో భారత్

ఉత్తర ప్రదేశ్ లోని  సాహిబాబాద్ రైల్వే స్టేషన్ లో ఢిల్లీ - ఘజియాబాద్ -  మేరట్ రీజినల్ రాఫిట్ ట్రాన్స్పోర్టు సర్వీస్ కారిడార్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

తాజా వార్తలు