న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఐటీ ఉద్యోగుల ఆందోళన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ బెంగళూరులో ఐటి ఉద్యోగులు నిరసనకు దిగారు.

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఫ్రీడం పార్కులో వారంతా ఆందోళన చేపట్టారు.

2.కాసానిని పరామర్శించిన దత్తాత్రేయ

ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ను హరియణ గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు.

3.టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ ఉన్నట్లు సిపి ఆనంద్ తెలిపారు.

4.ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఈనెల 26 వరకు సమన్లు జారీ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

5.చంద్రబాబుతో ములాఖత్ కు అనుమతి నిరాకరణ

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు ఆయన భార్య నారా భువనేశ్వరికి జైలు అధికారులు అనుమతి నిరాకరించారు.

6.అచ్చెన్న నాయుడు కామెంట్స్

చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారని, తెలుగు ప్రజలంతా ఆయనకు బాసటగా నిలుస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అన్నారు.

7.చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

Advertisement

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన మద్యంత్ర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ నెల 19 కు వాయిదా వేస్తూ విజయవాడ ఏసిబి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

8.వైయస్ వివేకా హత్య కేసు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కు తెలంగాణ హైకోర్టు అనుమతి నిరాకరించింది.

9.ఐటీ ఉద్యోగుల ఆందోళన పై పోలీసు ఆంక్షలు

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టులను నిరసిస్తూ హైదరాబాదులో ఐటీ ఉద్యోగులు చేపడుతున్న ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు.

10.బిజెపి బైక్ ర్యాలీ

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు.

11.రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తా : రేఖా నాయక్

తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

12.తెలంగాణ ప్రభుత్వం పై ఏపీ ఎమ్మెల్యే విమర్శలు

వైసీపీతో కలిసి తెలంగాణ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని వెంకటగిరి ఎమ్మెల్యే అనం రామనారాయణరెడ్డి విమర్శించారు .టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం పై స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

13.రఘురామ విమర్శలు

వైసిపి ప్రభుత్వంపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురాం కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.దరిద్రపు ప్రభుత్వం ఆరు నెలల్లో పోతుంది అంటూ రఘురామ విమర్శలు చేశారు.

14.నిరాహార దీక్షలో నందమూరి రామకృష్ణ

గన్నవరంలో టిడిపి నేతలు చేస్తున్న నిరాహార దీక్ష ప్రాంగణానికి నందమూరి రామకృష్ణ చేరుకున్నారు నాయకులు కార్యకర్తలు కలిసి నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

15.ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుపై శ్రీకాకుళం టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని,  వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని సీఎం జగన్ కు తెలుసునని,  చంద్రబాబును అరెస్టు చేస్తే టిడిపి నిర్వీర్యం అవుతుందని జగన్ భ్రమ పడుతున్నారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.

16.  ఢిల్లీ పర్యటనలో నారా లోకేష్

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై వివిధ పార్టీల అధినేతలు , కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యేందుకు టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

17.తిరుపతికి ప్రత్యేక బస్సులు

Advertisement

తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 17 నుంచి తిరుమలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తమిళనాడు రవాణా శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

18.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నేడు చివరి శ్రావణ శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది నేడు శ్రీవారి సర్వదర్శనానికి 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

19.నేడు భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ

వివేక హత్య కేసులో ఏడవ నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి  సిబిఐ కోర్టులో మభ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అనారోగ్య కారణాలతో 15 రోజులు మభ్యంతర ఇవ్వాలని భాస్కర్ రెడ్డి తరఫున న్యాయవాదులు కోరారు  దీనిపై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది.దీనిపై విచారణను కోర్టు  వాయిదా వేసింది.

20.నారాయణపై కేసులు విచారణ వాయిదా

రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణలతో మాజీ మంత్రి పి నారాయణ , మరికొందరిపై 2020లో సిఐడి నమోదు చేసిన కేసులు విచారణను హైకోర్టు ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది.

తాజా వార్తలు