న్యూస్ రౌండప్ టాప్ 20

1.సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.11 మంది మృతి

సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

బోయిగుడ లోని ఓ ప్లాస్టిక్ గోదాములో మంటలు చెలరేగి 11 మంది మృతి చెందారు. 

2.గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

  బాగ్ లింగంపల్లి లోని ముషీరాబాద్ బాలికల గురుకుల పాఠశాల లో 2022 - 23 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జి.శైలజ తెలిపారు. 

3.జనశక్తి నేత ఆనంద్ అరెస్ట్

 

జనశక్తి రాష్ట్ర కార్యదర్శి బొమ్మని నరసింహ అలియాస్ ఆనంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

4.టీడీపీ ఎమ్మెల్యే లు రెండు రోజులు సస్పెన్షన్

  అసెంబ్లీ లో టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యే లను రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. 

5.దిశ పెట్రోలింగ్ వెహికల్స్ ప్రారంభం

 

దిశా పెట్రోలింగ్ వాహనాలను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.మొత్తం 163 వాహనాలను ఆయన ప్రారంభించారు. 

6.తెలంగాణ హై కోర్టు కు పది మంది న్యాయమూర్తులు

 తెలంగాణ హై కోర్టు కు కొత్త గా పది మంది జడ్జీలు రానున్నారు.ఈ మేరకు కొత్త జడ్జీలను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్త్వులు జారీ చేశారు. 

7.మూడు రాజధానులే మా విధానం : బొత్స

 

Advertisement

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటే వైసీపీ ప్రభుత్వ విధానం అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 

8.కొత్త రైల్వే జోన్ల మంజూరుకు వినతి

  కడప జిల్లాలో కొత్తగా రైల్వే జోన్ల ను మంజూరు చేయాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు వినతి పత్రం ఇచ్చారు. 

9.తెలంగాణ హోం మంత్రి కి తప్పిన ప్రమాదం

 

తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీకి పెను ప్రమాదం తప్పింది.బోయిన్ గూడ అగ్ని ప్రమాదం సంఘటన ప్రదేశానికి మహమ్మద్ అలీ వెళ్ళిన సమయంలో ఆయన  పరిశీలించి బయటకు రాగానే కాలిన బిల్డింగ్ ఒక్కసారిగా  కుప్పకూలింది.ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. 

10.షర్మిల పాదయాత్ర లో తేనెటీగల దాడి

 వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర దాడి చేశాయి.

యాదాద్రి జిల్లా లోని మోటకొండూరు మండలం నుండి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో తేనెటీగలు దాడి చేశాయి.తేనెటీగల దాడి నుంచి షర్మిల క్షేమంగానే బయటపడ్డారు. 

11.భారత్ లో కరోనా

 

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1778 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

12.సెంట్రల్ స్కిల్ బోర్డులో ఖాళీల భర్తీ

  భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన బెంగుళూరులోని సెంట్రల్ స్కూల్ బోర్డులో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

13.మార్చి 31 నుంచి దేశంలో కొవిడ్ నిబంధనలు ఎతవేత

భారత్ లో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.31 నుంచి pobyt నిబంధనలు పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించుకుంది. 

14.ఢిల్లీకి చేరిన తెలంగాణ మంత్రులు

 

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

తెలంగాణలోని వడ్లను కొనే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చే వ్యూహాన్ని షేర్ అమలుచేయనున్నారు ఈ నేపథ్యంలోనే కొంతమంది మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. 

15.ఎథిక్స్ కమిటీ ముందుకు టిడిపి ఎమ్మెల్యేల వ్యవహారం

  అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఈరోజు వ్యవహరించిన తీరు వ్యవహారం ఎథిక్స్ కమిటీ ముందుకు చేరింది.టిడిపి సభ్యుల వ్యవహార శైలిని పరిశీలించి తగిన చర్యలు కమిటీ సూచించనుంది. 

16.దేశ రాజధానికి ఉగ్ర ముప్పు

 

Advertisement

దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఉత్తరప్రదేశ్ నిఘా వర్గాలు హెచ్చరించాయి. 

17.రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ ఫిక్స్

 

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు చిత్రం రామారావు ఆన్ డ్యూటీ మేకర్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. 

18.బోయ గూడా ప్రమాదంపై ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ విచారం

  సికింద్రాబాద్ బోయ గూడా ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటనలో పదకొండు మంది సజీవదహనం కావడం పై విచారణ వ్యక్తం చేశారు. 

19.కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ ను బర్తరఫ్ చేయాలి

 

కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ పై లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు.కేంద్రం తీరుకు నిరసనగా ఎంపీలు ఈరోజు సభలో ఆందోళన నిర్వహించారు.వెంటనే కేంద్ర మంత్రి భిసేశ్వర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,350   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,670.

తాజా వార్తలు