న్యూస్ రౌండప్ టాప్ - 20

1.బీజేపీ ఎంపీ అరవింద్ తో ఈటెల భేటీ

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఈరోజు ఉదయం సమావేశమయ్యారు.

2.జూలై 15 నాటికి ఏపీలో కరోనా ముగింపు

జూలై 15 నాటికి ఏపీలో కరుణ వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గుతుందని ఎస్ ఆర్ ఎం విశ్వవిద్యాలయ విద్యార్థుల బృందం తయారు చేసిన నివేదికను విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ నారాయణరావు మంగళవారం విడుదల చేశారు.జులై 15 నాటికి కరోనా పాజిటివ్ కేసులు 100 కంటే తక్కువ ఉంటాయి అని మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్ తో అంచనా వేసినట్టు పేర్కొన్నారు.

3.రోడ్ల మీదకు వస్తే కటిన చర్యలు

రాచకొండ పరిధులు సంపూర్ణంగా కొనసాగుతోందని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.అనవసరంగా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

4.తెలంగాణ లో లాక్ డౌన్

తెలంగాణలో పది రోజుల పాటు లాక్ డౌన్ అమలులోకి వచ్చింది.ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఇచ్చారు.

5.డి.శ్రీనివాస్ తో ఈటెల భేటీ

రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఈరోజు భేటీ అయ్యారు.

6.21 వరకూ భద్రాద్రి లో దర్శనాలు బంద్

తెలంగాణ ప్రభుత్వం పది రోజుల పాటు లాక్ డౌన్ విధించడం తో అన్ని దేవాలయాల్లో దర్శనాలు బంద్ అయ్యాయి.ఈ నేపథ్యంలో ఈనెల 21 వరకు భద్రాద్రి దర్శనాలు బంద్ కానున్నాయి.

7.పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు వాయిదా

ఏపీలో పంచాయతీరాజ్ సంస్థలలో ఖాళీగా ఉన్న స్థానాలకు జరగాల్సిన ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.

8.పాస్ పోర్ట్ సేవలన్నీ రద్దు

Advertisement

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో పాస్ పోర్ట్ సేవలను ఈ నెల 21వరకు రద్దు చేస్తున్నట్టు హైదరాబాద్ లోని ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి బాలయ్య తెలిపారు.

9.కొవిడ్ టీకాలకు గ్లోబల్ టెండర్లు

కోవిడ్ టీకాల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.మంగళవారం జరిగిన మంత్రి మండలి సమావేశం లో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

10.ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లకు లైన్ క్లియర్

ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ ల కు లైన్ క్లియర్ అయింది.ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను తెలంగాణలోకి రాకుండా నిలిపివేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణలోకి ఈరోజు ఉదయం నుంచి అనుమతిస్తున్నారు.

11.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది.మంగళవారం స్వామివారిని 2,262 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు.

12.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,48,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

13.మంత్రి అప్పలరాజు పై ఫిర్యాదు

మంత్రి సిరి అప్పలరాజు పై గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయ్యింది.రాష్ట్రంలో ఎన్ 440 కే వైరస్ వస్తుందని ప్రచారం చేశారని, మంత్రి వ్యాఖ్యలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అని, ఆయనపై చర్యలు తీసుకోవాలని దేవదాసు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.

14.90శాతం భారత్ లో అధిక పాజిటివిటి రేటు

దేశ వ్యాప్తంగా రెండో దశ ఉధృతి ఇంకా ఆందోళనకరంగానే ఉంది భారత్లో దాదాపు 90 శాతం ప్రాంతాల్లో కరోనా పాజిటివిటి రేటు అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

15.రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి సమావేశం

కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో వెనుకబడిన రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ బుధవారం సమావేశం కానున్నారు.

16.కోలుకున్న అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నారు.తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలియజేస్తూ ఆయన బుధవారం ట్వీట్ చేశారు.

17.పిల్లలపై కోవాగ్జిన్  ప్రయోగ పరీక్షలు

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

దేశీయ ఔషధం దిగ్గజం భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జీన్ ను రెండేళ్ల చిన్నారి నుంచి 18 ఏళ్ల యువతిపై ప్రయోగించి పరీక్షించనున్నారు.

18.ఆవు పేడ చికిత్స ప్రమాదకరం

ఆవు పేడ చికిత్స ప్రమాదకరమని దాని శరీరానికి చూసుకోవడం వల్ల మ్యుకో మైకోసిస్ ఒంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తడం ముప్పు ఉందని గుజరాత్ వైద్యులు హెచ్చరించారు.

19.నా సాయం విలువ 15 కోట్లు

Advertisement

కరోనాపై పోరులో భాగంగా సుమారు 15 కోట్ల వరకు విరాళంగా ఇచ్చాను అని ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు అమితాబ్ బచ్చన్ ప్రకటించారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -44,720 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -45,720.

తాజా వార్తలు