న్యూస్ రౌండప్ టాప్ 20

1.కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారం

జగన్ చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కించుకున్న మంత్రులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.

 

2.భద్రాద్రి కి గవర్నర్ తమిళ సై

  ఈరోజు తెలంగాణ గవర్నర్ తమిళ సై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెళ్లనున్నారు.రెండు రోజుల పాటు ఆ జిల్లాలో పర్యటించనున్నారు. 

3.గవర్నర్ పర్యటన ప్రోటోకాల్ వివాదం

 

భద్రాచలంలో రాష్ట్ర గవర్నర్ తమిళ సై పర్యటన కొనసాగుతోంది.గవర్నర్ పర్యటనకు కలెక్టర్, ఎస్పీ హాజరుకాకపోవడం ప్రోటోకాల్ వివాదం నెలకొంది. 

4.హైదరాబాద్ లో తనిఖీలు

  హైదరాబాద్ నగరంలోని పలు కన్సల్టెన్సీలలో యూఎస్ ఎంబసీ , ఇమ్మిగ్రేషన్, ఢిల్లీ పోలీసులు తనిఖీ నిర్వహించారు. 

5.జగ్గయ్యపేట లో ఉదయభాను అనుచరుల హడావుడి

 

ఎన్.టి.ఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణంలో వైసీపీ నేత ఉదయభాను అనుచరులు హల్ చల్ చేశారు.మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంపై అనుచరులు ఆందోళనకు దిగారు. 

6.బాలినేని నివాసం వద్ద హై టెన్షన్

 మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది.భవిష్యత్ కార్యాచరణపై జిల్లాకు చెందిన నేతలు చర్చిస్తున్నారు.మరికొద్ది సేపట్లో బాలినేని తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. 

7.అసంతృప్తుల రాజీనామాలపై సజ్జల స్పందన

 

Advertisement

మంత్రి పదవులు రాణి అసంతృప్తి నేతలు రాజీనామా చేస్తున్నారనేది ప్రచారమే అని, ఇందులో నిజం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. 

8.చలో పెద కాకాని శివాలయం

  టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో చలో పెద కాకాని శివాలయానికి పిలుపునిచ్చారు.శివాలయంలో మాంసాహారం వంటకాలపై దూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

9.దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి రాజా

  ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ను మంత్రి ఆర్కే సోమవారం ఉదయం దర్శించుకున్నారు. 

10.మంత్రివర్గం ఏర్పాటు పై కాంగ్రెస్ కామెంట్స్

 

ఏపీ సీఎం జగన్ మంత్రివర్గం కూర్పు ఒక ప్రహసనం అని, మంత్రులు విగ్రహాలు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి విమర్శించారు. 

11.జ్యోతిరావు పూలే కు లోకేష్ నివాళులు

 

మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నివాళులర్పించారు. 

12.పోలీసులపై దాడి

  ఏలూరు జిల్లాలో కోడి పందాలు,  పేకాట రాయుళ్లు పోలీసులు దాడికి దిగారు.లింగం పాలెం మండలం ఎడవల్లి గ్రామంలో ఆదివారం కోడి పందాలు ఆడుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు వారిని పందెం రాయుళ్లు నిర్బంధించారు. 

13.టిఆర్ఎస్ దీక్ష ప్రారంభం

 

ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ రైతుల పక్షాన నిరసన దీక్ష పేరుతో ఈ దీక్ష ప్రారంభమైంది. 

14.మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి హాజరుకాని మాజీమంత్రులు

  ఏపీ లో నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ మంత్రులు సుచరిత బాలినేని శ్రీనివాస్ రెడ్డి గైర్హాజరు అయ్యారు. 

15.ఆయన వడ్లు కొనలేని దద్దమ్మ : షర్మిల

 

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగిస్తున్నారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు షర్మిల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.  ఆయన వడ్లు కొనలేని దద్దమ్మ అంటూ ఘాటుగా విమర్శించారు. 

16.నేడు బిజెపి రైతు దీక్ష

 యాసంగి వరి కొనుగోలు చేయాలంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. 

17.దోపిడీ కోసమే కేసీఆర్ ధర్నా

 

Advertisement

ధాన్యం కొనుగోళ్ల పేరిట దోపిడీకి పాల్పడడానికే తెలంగాణ సీఎం కేసీఆర్ చేయబోతున్నారని పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. 

18.కేంద్రానికి కేసీఆర్ డెడ్ లైన్

  రైతుల దగ్గర ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఈ రోజు దీక్ష చేపట్టింది.కేంద్రానికి కేసీఆర్ ,24 గంటల డెడ్ లైన్ విధించారు. 

19.రేపు తెలంగాణ కేబనెట్ అత్యవసర సమావేశం

 

రేపు తెలంగాణ క్యాబినెట్ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు  

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,600   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 53,020.

తాజా వార్తలు