న్యూస్ రౌండప్ టాప్ 20

1.అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు పొడిగింపు

అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును  తెలంగాణలో పొడగించారు దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రోనాల్డ్ రాస్ శాఖల వారీగా ఉత్తర్వులు జారీ చేశారు.

 

2.30 వరకు వేసవి సెలవులు

  తెలంగాణలోని జూనియర్ కాలేజీ లకు ఈనెల 20 వరకు ఉన్న వేసవి సెలవులను 30వరకు పొడిగించారు. 

3.బీసీ గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు

   మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకుల జూనియర్ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 27 లోపు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని బీసీ గురుకులాల సంస్థ కార్యదర్శి కోరారు. 

4.బాసర సరస్వతి క్షేత్రంలో దర్శనాలు ప్రారంభం

  లాక్ డౌన్ కారణంగా నిర్మల్ బాసర సరస్వతి క్షేత్రంలో దర్శనాలు నిలిపి వేయగా, సోమవారం నుంచి లాక్ డౌన్ ఎత్తి వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బాసర సరస్వతి విద్యక్షేత్రం దర్శనాలు సేవలు ప్రారంభమవుతాయి. 

5.ఎల్ బి సెట్ దరఖాస్తు పొడగింపు

  ఎల్ పి సెట్ దరఖాస్తు గడువును ఈనెల 28 వరకు పొడిగించినట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్  తెలిపింది. 

6.తెలంగాణ బార్డర్ లో ఆంక్షలు ఎత్తివేత

  తెలంగాణ రాష్ట్రంలో కరుణ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.దీంతో తెలంగాణ సరిహద్దుల్లో అర్ధరాత్రి నుంచి ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

7.మోడల్ స్కూల్స్ దరఖాస్తు గడువు పెంపు

   మోడల్ స్కూల్స్ లో 6 నుంచి 10 తరగతులలో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష గడువు ఈ నెల 30 వరకు పొడగించామని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన తెలిపారు. 

8.తెలంగాణలో కరోనా

  గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

9.ఏపీ డీజీపీ కి చంద్రబాబు లేఖ

  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు.నెల్లూరు జిల్లాలో దాడికి గురైన ఎస్సీల పై అక్రమ కేసులు పెట్టారని మట్టి మాఫియా ను ప్రశ్నించిన మల్లికార్జున వేధించారని, ఆయన పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ లేఖలో పేర్కొన్నారు. 

10.జగన్ కు రఘురామ లేఖ

Advertisement

  ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు.అందులో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని ఆయన కోరారు. 

11.14వ రోజు సిబిఐ విచారణ

  వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప సెంట్రల్ జైలు కేంద్రంగా 14వ రోజు సిబిఐ అధికారులు విచారణ కొనసాగించారు.ఈ సందర్భంగా పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు చెందిన కొంతమందిని సిబిఐ అధికారులు విచారించారు. 

12.తమిళనాడు మాజీ మంత్రి అరెస్ట్

  ఓ నటిని పెళ్లి చేసుకుంటానని మోసగించిన కేసులు తమిళనాడు మాజీ మంత్రి ఎం.మణికందన్ ను చెన్నై నగర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. 

13.చిత్తూరులో ఏనుగుల గుంపు బీభత్సం

  చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం చిక్కడపల్లి, వేలు పల్లి పరిసరాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.పంట పొలాలపై ఏనుగుల దాడి చేశాయి. 

14.22 నుంచి మంత్రాలయంలో కి ఎంట్రీ

  కర్నూలు జిల్లాలోని మంత్రాలయం లోని రాఘవేంద్ర స్వామి మఠం లోకి ఈనల 22 నుంచి భక్తులను అనుమతించనున్నారు. 

15.భద్రాద్రి లో దర్శనానికి అనుమతి

  భద్రాచలం సీతా రామ స్వామి ఆలయంలో ఆదివారం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

16.ఏపీలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్

  ఆంధ్రప్రదేశ్ లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది.8 లక్షల నుంచి 10 లక్షల మందికి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 

17.జంతువులకు సార్స్ కోవ్ 2 ముప్పు

  జంతువులకు సార్స్ కోవ్ 2 ప్రమాదం ముప్పు పొంచి ఉంది.ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది.తమిళనాడులో ఇటీవల రోజుల వ్యవధిలో రెండు సింహాలు ఈ వైరస్ ప్రభావం తో మృతి చెందాయి. 

18.గ్రీన్ ఫంగస్ కేసు

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

  మధ్యప్రదేశ్లని ఇండోర్ లో ఓ వ్యక్తి గ్రీన్ ఫంగస్ బారిన పడినట్లుగా అధికారులు పేర్కొన్నారు. 

19.ఇండియా దుబాయ్ విమాన సర్వీసులు ప్రారంభం

  కరోనా తగ్గుముఖం పట్టడంతో భారత్ విమానాలపై నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు దుబాయ్ ప్రకటించింది . 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 43,990   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,990.

Advertisement

తాజా వార్తలు