న్యూస్ రౌండప్ టాప్ 20

1.మమతా బెనర్జీపై హైకోర్టు ఆగ్రహం

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

హింస చెలరేగిన అప్పటికి పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

2.మయన్మార్ పై తీర్మానం .ఓటింగ్ కు భారత్ దూరం

  మయన్మార్ లో రాజకీయ సంక్షోభానికి తెర దించి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని సైనిక అధికారులను కోరుతూ సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రవేశపెట్టింది .ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించగా, దీనికి భారత్ దూరంగా ఉంది. 

3.24న జమ్మూ లో ప్రధాని సమావేశం

  ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 24వ తేదీన జమ్మూకాశ్మీర్ కు చెందిన వివిధ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. 

4.ఏపీలో ఎంసెట్ కు బదులుగా ఈ ఏపీసెట్

  ఏపీలో ఎంసెట్ కు బదులుగా ఈ ఏపీసెట్ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 

5.లాక్ డౌన్ పై తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం

  ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది.లాక్ డౌన్, వర్షపాతం, సాగు వ్యవసాయ సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. 

6.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 60,753 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

7.డిజిటల్ సర్వే కు 16 గ్రామాల ఎంపిక

  తెలంగాణలో ప్రయోగాత్మకంగా చేపట్టిన డిజిటల్ ల్యాండ్ సర్వే తొలివిడత 16 గ్రామాలను ఎంపిక చేశారు . 

8.6 కోట్లు నకిలీ విత్తనాల పట్టివేత

  నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ను నల్గొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు.ఈ సందర్భంగా ఏపీ తెలంగాణకు చెందిన 13 మంది నిందితులను అరెస్టు చేసి ఆరు కోట్ల విలువైన నకిలీ విత్తనాలు, రెండు కార్లు, 13 సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

9.550 వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

Advertisement

  అమరావతి ఉద్యమం 550 ఒక రోజుకు చేరుకుంది.దీక్షా శిబిరాల్లో రైతులు నిరసన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు, మహిళలు నినాదాలు చేశారు. 

10.21న యాదాద్రి పర్యటనకు కేసీఆర్

  తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 21న యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. 

11.ఢిల్లీలో డీఎంకే కార్యాలయం

  దేశ రాజధాని ఢిల్లీలో డిఎంకె కార్యాలయం నిర్మితం కానుంది.ఈ మేరకు రెండు నెలల్లో దానిని పూర్తిచేసే విధంగా కసరత్తు ఆ పార్టీ మొదలుపెట్టింది. 

12.కెనడా సుప్రీం న్యాయమూర్తిగా భారత సంతతి వ్యక్తి

  భారత సంతతికి చెందిన జస్టిస్ మహమ్మద్ జమాల్ కెనడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా నామినేట్ చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో ప్రకటించారు . 

13.భౌగోళిక ముప్పుగా డెల్టా వేరియంట్

  భారత్ లో మొదట బయటపడిన కోవిడ్ 19 డెల్టా వేరియంట్ భౌగోళికంగా ప్రభావం చూపుతోందని దానికున్న గణనీయంగా విస్తరించే స్వభావమే ఈ పరిస్థితికి కారణం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ జెనీవాలో ప్రకటించారు. 

14.కోవేట్ థర్డ్ వేవ్ అనివార్యం

  భారత్ లో థర్డ్ వ్యాపించడం అనివార్యమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రంజిత్ అభిప్రాయపడ్డారు. 

15.సైబర్ మోసాలపై ఫిర్యాదుకు హెల్ప్ లైన్ నెంబర్

  ఆర్థిక లావాదేవీల విషయంలో జరిగే సైబర్ మోసాలను అరికట్టడం కోసం 155260 హెల్ప్ లైన్ నంబర్ ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. 

16.ఏపీలో రేపు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

  ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది.రేపు ఒక్క రోజే 8 లక్షల కరోనా వైరస్ వ్యాక్సిన్ లు వేసేలా లక్ష్యం గా పెట్టుకుంది. 

17.ఈ డి విచారణపై స్పందించిన ఎంపీ నామ

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

  జార్ఖండ్లో మధుకాన్ కంపెనీ చేపట్టింది నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి నామ జూన్ 25న ఈడీ అధికారులు విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో , తాను విచారణకు సహకరిస్తా అని, నేను ఎవరిని మోసం చేయలేదు అని నామా నాగేశ్వరరావు స్పందించారు. 

18.కరోనా మార్గదర్శకాలు

  గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు కరోనా కట్టడికి విధించిన ఆంక్షలు సడలిస్తున్నాయి.ఈ క్రమంలో రాష్ట్రల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం లేఖలు రాశారు. 

19.కొడాలి నాని కామెంట్స్

Advertisement

  నారా లోకేష్ పిచ్చికుక్కలా అరుస్తున్నాడు అని పప్పు తుప్పు ఇద్దరు ఇంటికే పరిమితమయ్యారు అని, మంత్రి కొడాలి నాని సంచలన విమర్శలు చేశారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,230   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,230.               .

తాజా వార్తలు