న్యూస్ రౌండ్ టాప్ 20 

1.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 2909 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆరుగురు ఈ వైరస్ ప్రభావం తో మృతి చెందారు.

2.ఎంఎంటీఎస్ రైలు కు బ్రేకులు

తెలంగాణలో కోవేట్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఎంఎంటీఎస్ రైళ్ల ను మరి కొద్ది నెలల పాటు నిలిపివేసే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నారు.

3.షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు

షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్ బోర్డ్ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.

4.జూన్ 7 నుంచి గీతం దూరవిద్య పరీక్షలు

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అనుబంధంగా గల గీతం సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా డిగ్రీ , పీజీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు జూన్ ఏడో తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీడియెల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

5.కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి

కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మాస్కుల ధారణ, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కమిషనర్ , ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించారు.

6.30 టీఎంసీలను కేటాయించాలి

 భవిష్యత్ అవసరాల కోసం 30 టీఎంసీల నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డు ను కోరింది.

7.ఐ ఐ టి హెచ్ లో ఎంటెక్ ఏఐ కోర్సు

సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటి హైదరాబాద్ లో కొత్తగా ప్రారంభించిన స్కూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎంటెక్ కోర్సును ప్రవేశపెట్టారు.ఏప్రిల్ 14 లక్షల దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు కోరారు.

8.ఆర్టీసీ ఉద్యోగులకు టీకా

Advertisement

45 ఏళ్లు పైబడిన ఆర్టీసీ ఉద్యోగులకు కొవిడ్ సేకరించాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.

9.జెడ్పీ చైర్మన్ కు జరిమానా

నిబంధనలు నిబంధనలు పాటించని వనపర్తి జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి కి మున్సిపల్ కమిషనర్ వెయ్యి రూపాయలు జరిమానా విధించారు.మాస్క్ పెట్టుకోకపోవడమే దీనికి కారణమట.

10.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతుంది.శుక్రవారం శ్రీవారిని 39,085 మంది భక్తులు సందర్శించుకున్నారు.శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం కోటి 75 లక్షలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

11.ఈ నెల 12న హైకోర్టుకు సెలవు

ఉద్యోగుల సంఘం అభ్యర్థన మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కుమార్ గోస్వామి ఈ నెల 12న హైకోర్టుకు సెలవు ప్రకటించారు.

12.అమరావతి దీక్షలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, మూడు రాజధానులకు వ్యతిరేకంగా  రాజధాని గ్రామాల రైతులు, మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు నేటికి 480 వ రోజుకు చేరుకున్నాయి.

13.ఏలూరు ఎన్నికల పై విచారణ 19కి వాయిదా

ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలు విషయంలో దాఖలైన పిటిషన్ పై విచారణ ఈ నెల 19 వాయిదా పడింది.

14.ఏపీ లో కరోనా

చిన్న 24 గంటలలో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం  2,765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

15.పశువుల దాణా డోర్ డెలివరీ

పశుగ్రాస విత్తనాలు, దాణా మిశ్రమం, సైలేజ్ గడ్డి, ఇతర ఇన్ఫుట్స్ ను ఇక రైతుల ఇంటి వద్దకే సరఫరా చేయనున్నారు.గ్రామ వలంటీర్ల సాయంతో పశుసంవర్ధక శాఖ సహాయకులు డోర్ డెలివరీ చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

16.రఘురామకృష్ణంరాజు ఢిల్లీలోనూ భద్రత

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు ఢిల్లీలో కూడా ప్రత్యేక భద్రత కల్పించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించింది.

17.దిండిగల్ లో చేపల వేడుక

తమిళనాడు లోని దిండిగల్ సమీపం పుగయిలై పట్టి గ్రామంలో జరిగిన చేపలు పట్టే వేడుకల్లో పరిసర గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

18.భారత్ లో కరోనా

దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 1,45,384 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

19.వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఫ్రీ

కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఉచితంగా ఇస్తామని గుర్గావ్ లోని వినూత్న ఆఫర్ ప్రకటించింది.

20.ఈరోజు బంగారం ధరలు

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 44,570 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,570.

Advertisement

తాజా వార్తలు