న్యూస్ రౌండప్ ... టాప్20

1.బండి సంజయ్, అక్బరుద్దీన్ పై కేసు

జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు ఇద్దరి పైనా కేసు  నమోదు చేశారు.

2.రేపటితో ముగియనున్న ప్రచారం

జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ మంగళవారం జరగనున్న నేపథ్యంలో, ఆదివారం సాయంత్రం 05 గంటలతో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది.

3.వాయిదా పడ్డ మెడికల్ కౌన్సిలింగ్

తెలంగాణలో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల భర్తీకి నిర్వహించనున్న కౌన్సిలింగ్ కు బ్రేక్ పడింది.

4.లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టం

ఉత్తర ప్రదేశ్ లో లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా యూపీ ప్రభుత్వం చట్టం తెచ్చింది.దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆనంది బెన్ పటేల్ జారీ చేశారు.

5.కరోనాతో ఎమ్మెల్యే మృతి

కరోనా వైరస్ ప్రభావానికి గురై మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భారత్ భాల్కే మరణించారు.

6.సీఎం కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

Advertisement

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజకీయ కార్యదర్శి ఎన్ ఆర్ సంతోష్ కుమార్ శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

7.జగన్ ఏరియల్ సర్వే

>వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా చూసేందుకు ఏపీ సీఎం జగన్ నేడు ఏరియల్ సర్వే చేపట్టారు.

8.రైళ్లలో పిల్లలకు నో ఎంట్రీ

ముంబై లోకల్ రైళ్లలో చిన్న పిల్లలతో కలిసి ప్రయాణం చేయడం పై నిషేధం విధించారు.

9.భారత్ లో కరోనా

భారత్ లో గడచిన 24 గంటల్లో కొత్తగా 41, 322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.485 మంది మృతి చెందారు.

10.హైదరాబాద్ చేరుకున్న ప్రధాని

హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ పేరుతో కరోనా వాక్సిన్ తయారు చేస్తుండటంతో, దానిపై పురోగతిని తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ కు విచ్చేశారు.

11.ప్రధాని ప్రోటోకాల్ ఉల్లంఘన పై రేవంత్ ఆగ్రహం

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన పై తనకు సమాచారం ఇవ్వలేదని, తనను ఆహ్వానించకపోవడం పై మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు.

12.తెలంగాణలో కరోనా

తెలంగాణ లో నిన్న రాత్రి 8 గంటల వరకు అందిన లెక్కల ప్రకారం కొత్తగా 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

13.బిజెపి ఎంపీ కి జనసేన వార్నింగ్

భవిష్యత్తులో జనసేన తో ఎటువంటి పొత్తు ఉండదని బిజెపి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడంపై జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

14.ఉగ్రవాదిని పట్టిస్తే 37 కోట్లు నజరానా

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

2008లో ముంబై లో జరిగిన ఉగ్రదాడుల లో కీలకంగా వ్యవహరించిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మిర్ ను పట్టిస్తే  ఐదు లక్షల అమెరికన్ మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో 37 కోట్లు ) ఇస్తామని అమెరికా ప్రకటించింది.

15.డిసెంబర్ 2న విడుదల కానున్న వివో v20 ప్రో

Vivo v20 pro 5g మొబైల్ ను డిసెంబర్ 2 వ తేదీన భారత్ లో లాంచ్ చేయబోతున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.

16.జైలులో ఖైదీల కోసం ఏటీఎం

Advertisement

ఖైదీల అవసరాల కోసం జైలు ఆవరణలోనే  ఎస్బిఐ ఏటీఎం ను బీహార్ రాష్ట్రం పూర్నియా సెంట్రల్ జైలు లో మొదటిసారిగా ఏర్పాటు చేయబోతున్నారు.

17.మాస్క్ లేకపోతే అరెస్ట్

మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారిని వెంటనే అరెస్టు చేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖను ఆదేశించింది.

18.ఎస్పీ బాలు పాత్రలో అమితాబ్

మిధునం సినిమా బాలీవుడ్ లోకి రీమేక్ కాబోతోంది.ఇందులో ఎస్పీ బాలసుబ్రమణ్యం పాత్రలో అమితాబచ్చన్ నటించబోతున్నారు.

19.ఏపీకి తుఫాను గండం

ఇప్పటి వరకు నివర్ తుఫాన్ కారణం గా  తీవ్రంగా నష్టపోయిన ఏపీ ప్రజలకు ఇప్పుడు హిందూ మహా సముద్రంలో ఏర్పడిన మరో తుఫాను ఆందోళన కలిగిస్తోంది.ఈ తుఫాను ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -45,450.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,090.

తాజా వార్తలు