న్యూస్ రౌండప్ టాప్ 20 

1.కేసీఆర్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులు లేవని, తాను కూడా ఉద్యమం కోసం కెసిఆర్ కు డబ్బులు ఇచ్చానని, అందులో కొంత డబ్బును డైవర్ట్ చేశారని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

2.బ్యాంకు మేనేజర్ పై కేసు నమోదు

ఇంటి రుణాలు ఇప్పించేందుకు లంచం అడిగిన ఈ వ్యవహారంలో  జూబ్లీహిల్స్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ మన్మధ రావు పై పోలీసు కేసు నమోదయ్యింది.

3.సంక్రాంతి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

సంక్రాంతి విశిష్టత ప్రతిభా పురస్కారాలు -2021 కోసం వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రతిభావంతులు, సమాజ సేవలో ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సర్వేజనా సుఖినోభవంతు సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ నారాయణ మాస్టర్ తెలిపారు.

4.సోనూసూద్ విగ్రహం ఏర్పాటు

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చెలిమి తండాలో సోను సూద్ విగ్రహాన్ని రాజేష్ రాథోడ్ అని సోనూసూద్ అభిమాని ఏర్పాటు చేశారు.

5.బావిలో పడిన ఎలుగుబంట్లు

కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి శివారులో  రెండు  ఎలుగు బంట్లు ప్రమాదవశాత్తు బోరు బావిలో పడ్డాయి.వీటిని గుర్తించిన స్థానిక రైతులు పోలీసు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

6.జగనన్న శాశ్వత భూ హక్కు.భూ రక్ష పథకం ప్రారంభం

Advertisement

వైయస్సార్ జగన్ అన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం ఈ రోజు ప్రారంభమైంది.కృష్ణా జిల్లాలోని జగ్గయ్య పేట లో ఈ పథకాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.

7.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 316 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.కరోనా ప్రభావంతో ఇద్దరు మృతి చెందారు.

8.భారత్ లో కరోనా వ్యాక్సిన్

భారత్ లో వచ్చే ఏడాది జనవరిలో కరోనా వైరస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున చేపడతామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

9.నేపాల్ పార్లమెంట్ రద్దు

అధికార పక్షంలోనూ ప్రత్యర్థులకు నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ వోలి ఊహించని షాక్ ఇచ్చారు.పార్లమెంటును రద్దు చేయాలని అధ్యక్షురాలు విద్యా దేవి బండారి కి సిఫార్సు చేశారు.వెంటనే విద్యా దేవి బండారి పార్లమెంటును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

10.ఏపీలో కరోనా

గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 438 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

11.కొత్తరకం కరోనా పై అత్యవసర సమావేశం

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

యూకే లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న భారత ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.ఈ విషయమై చర్చించేందుకు covid-19 జాయింట్ గ్రూప్ ను సోమవారం సమావేశానికి పిలిచినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

12.భారత్ లో సౌదీ పెట్టుబడులు

భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.

13.జగన్ కు చంద్రబాబు బర్త్ డే విషెస్

Advertisement

ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

14.గుండెపోటుతో ఇద్దరు రాజధాని రైతులు మృతి

ఏపీ రాజధాని అమరావతి లో యాక్టివ్ గా ఉంటూ వస్తున్న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం గ్రామానికి చెందిన పాతూరి హైమావతి (58), అదే మండలంలోని అనంతపురానికి చెందిన వీర రాఘవులు (65) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.

15.లద్దాక్ లో చైనా వాహనాలు

చైనాకు చెందిన రెండు వాహనాలు భారత్ సరిహద్దులోని లద్ధాక్ లోని లేహ్ జిల్లాలో కనిపించడం కలకలం రేకెత్తించింది.అయితే ఈ వ్యవహారంపై భారత సైన్యం ఎటువంటి ప్రకటన చేయలేదు.

16.తాగునీటి పైపుల్లో క్యాన్సర్ కారకాలు

నీటి సరఫరా ఉపయోగించి కొన్ని రకాల పైపుల్లో రసాయనిక చర్యల మూలంగా క్యాన్సర్ కారకాలు విడుదలవుతున్నట్లు తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది.ముఖ్యంగా పైపుల్లో ని ఇనుప తుక్కు లో ఉండే కొన్ని రకాల అణువులతో నీటిశుద్ధి రసాయనాలు జరిగే చర్యల వల్ల క్యాన్సర్ కారకాలు విడుదలవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

17.బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి అస్వస్థత

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ది కశ్మీర్ ఫైల్స్ సినిమా షూటింగ్ ముస్సోరి లో జరుగుతోంది.ఈ చిత్ర షూటింగ్ లో నటుడు మిధున్ చక్రవర్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

18.జమిలి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సంచలన వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు.

19.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,100 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -51,380

20.రేపు నడి రోడ్డుపై వర్మ ప్రెస్ మీట్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ చిత్రం విడుదలకు దగ్గర అవుతుండడంతో రేపు మిర్యాలగూడ నటరాజ్ థియేటర్ రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టాలని డిసైడ్ అయినట్లు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు.

తాజా వార్తలు