న్యూస్ రౌండప్ టాప్ 20

1.బైడన్ టీం లో మరో ఇండో అమెరికన్

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడన్ మన టీంలో భారత సంతతికి చెందిన వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.

తాజాగా భారత సంతతికి చెందిన వేదాంత పటేల్ ను అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ గా నియమించారు.

2.వ్యాక్సిన్ వేసుకున్నాక, జ్వరం రావచ్చు

కోవిడ్ వాక్సిన్ వేయించుకున్నాక కొంత మంది లో తేలికపాటి జ్వరం, ఇంజక్షన్ చేయించుకున్న ప్రదేశంలో నొప్పి కలిగే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.

3.వ్యవసాయ వర్సిటీకి జాతీయ అవార్డు

తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.సమీకృత వ్యవసాయ విధానంపై ఏర్పాటైన అఖిలభారత సమన్వయ పరిశోధన ప్రాజెక్ట్ కి 2018 - 20 కి జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది.

4.కొనసాగుతున్న పులుల వేట

కొమురం భీం జిల్లాలో పులి సంచారం పై ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వాటిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు.వీటికోసం ప్రత్యేకంగా బోనులను  ఏర్పాటు చేశారు

5.ఈడీ కేసుల విచారణ పై జనవరి 11 న ఉత్తర్వులు

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ పూర్తయ్యాకే, ఈడి కేసులను విచారించాలి అని నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలు ముగిశాయి.దీనిపై జనవరి 11న ఉత్తర్వులు ఇస్తామని సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రావు ప్రకటించారు.

6.అగర్వాల్ ఇండస్ట్రీ సిబి ఐ కేసు

తప్పుడు సమాచారం ఇచ్చి వ్యాపార అవసరాలకు తీసుకున్న 200 కోట్లు ఎగ వేసిన కేసులో హైదరాబాద్ లోని అగర్వాల్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు సంస్థ ఎండి, మరికొందరు పై సిబిఐ కేసు నమోదు చేసింది.

7.ఉద్యోగాల భర్తీకి కసరత్తు

తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

8.ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

Advertisement

ఖమ్మం జిల్లాలోని ఎర్రు పాలెం మండలం రేమిడిచర్ల లో క్షుద్రపూజల కలకలం రేపింది.గుప్త నిధులు కోసం పూజలు చేశారు అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

9.డిండి రిజర్వాయర్ నుంచి భారీగా వరద నీరు లీక్

నల్గొండ జిల్లాలోని డిండి రిజర్వాయర్ నుంచి భారీగా వరద నీరు లీక్ అవుతు న్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

10.గన్ కల్చర్ పై పోలీసుల అలెర్ట్

అదిలాబాద్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారుక్ అహ్మద్పటేల్ కాల్పులు జరిగిన ఘటనపై పోలీసులు సీరియస్ గా స్పందించారు .జిల్లాలో తొలిసారిగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో గన్ కల్చర్ పై సీరియస్ గా దృష్టి పెట్టారు.

11.మ్యాన్ ఈటర్ పులి కాల్చివేత

మహారాష్ట్రలో ఎనిమిది మందిని చంపిన మ్యాన్ ఈటర్ పులిని షోలాపూర్ జిల్లాలో అటవీ శాఖ అధికారులు కాల్చిచంపారు.

12.మేకను చంపి తిన్న చిరుత

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.గురువారం రాత్రి మేకల మంద పై దాడి చేసిన చిరుత ఒక మేకను ఎత్తుకెళ్లింది.

13.కన్వీనర్ కోటాలో 476 సీట్లు

ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో సీటు ఖరారైన 476 మంది ఇప్పటివరకు కాలేజీల్లో చేరలేదని , కాళోజి హెల్త్ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లకు ఒకటి రెండు రోజుల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

14.ట్రాన్స్ ట్రాయ్ పై కేసు 

ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ,ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్లు రాయపాటి సాంబశివరావు , అక్కినేని సతీష్ పై సీబీఐ కేసు నమోదు చేసింది.

15.గతం మూవీ కి అరుదైన అవకాశం

గతం మూవీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లోని ఇండియన్ పనోరమా కేటగిరిలో ప్రదర్శితం కాబోతున్న ఏకైక తెలుగు సినిమా గా నిలిచింది.

16.ఉచిత తాగునీటి కార్యక్రమం

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఈ టాలీవుడ్ సెలబ్రిటీల అకౌంట్స్ హ్యాక్.. దానివల్ల వారు పడిన ఇబ్బందులు..??

వచ్చే ఏడాది తొలి వారంలోనే హైదరాబాదులో ఉచిత తాగునీటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

17.అరకు అందాల రైలు మళ్లీ ప్రారంభం

కొత్తవలస కిరండూల్ ( కేకే లైన్ ) ప్రత్యేక రైలు రాకతో బొర్రా - అరకు రైల్వే స్టేషన్ మొదటి రోజు కళకళలాడింది.

18.పెళ్లి పై అల్లు శిరీష్ క్లారిటీ

Advertisement

అల్లు శిరీష్ నాకంటే వయసులో పెద్దవాడు వచ్చే ఏడాదిలో తన పెళ్లి జరగవచ్చు అంటూ ఇటీవల శిరీష్ పెళ్లి గురించి సాయి ధరంతేజ్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.దీనిపై శిరీష్ స్పందించారు.సాయి ధరమ్ తేజ్ జోక్ చేశారని, నా పెళ్ళి విషయాన్ని తానే స్వయంగా ప్రకటిస్తానని శిరీష్ ప్రకటించారు.

19.తెలంగాణలో కరోనా 

తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 627 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,800 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,050.

తాజా వార్తలు