న్యూస్ రౌండప్ టాప్ 20 

1.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,380 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

2.బండి సంజయ్ పాదయాత్ర

 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర గద్వాల్ జిల్లాలో కొనసాగుతోంది.ఈ రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేశారు. 

3.వైసీపీ ప్రభుత్వం పై చాలా కోపం వస్తోంది : చంద్రబాబు

  వైసీపీ ప్రభుత్వం పై చాలా కోపం వస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.సభ్యత అడ్డం వచ్చి సంయమనం పాటిస్తున్నారు అని ఆయన అన్నారు. 

4.ఈ రోజు రాత్రి ప్రధాని ప్రసంగం

 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు.ఎప్పుడు లేని విధంగా సూర్యాస్తమయం తరువాత ఈ రోజు రాత్రి 9.30 నిమిషాలకు ప్రధాని ప్రసంగించనున్నారు. 

5.సొంత పార్టీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం

  క్షేత్రస్థాయిలో పని చేయకుండా పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తే ఎలా అని,  సీనియార్టీ ఉన్నా, ప్రజలతో ఓట్లు వేయించకపోతే ఎలా అంటూ సొంత పార్టీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

6.కిషన్ రెడ్డి పై గంగుల కమలాకర్ విమర్శలు

 

Advertisement

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు చేశారు.తెలంగాణ పై విషం చిమ్ముతున్నారని కిషన్ రెడ్డి పై మండిపడ్డారు. 

7.కరోనా కారణంగా మెట్రో రైలు నష్టపోయింది : ఎన్ వీఎస్ రెడ్డి

   కరోనా కారణంగా మెట్రో రైల్వేస్ తీవ్రంగా నష్టపోయిందని  మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 

8.కెసిఆర్ పై మధుయాష్కీ కామెంట్స్

 

రైతాంగాన్ని మోసం చేస్తున్న నయవంచకుడు కెసిఆర్ అని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. 

9.9 వ రోజుకు చేరిన ప్రాణహిత పుష్కరాలు

  ప్రాణహిత పుష్కరాలు నేటికి తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. 

10.పవన్ కళ్యాణ్ విమర్శలు

 

ఒంగోలులో సీఎం పర్యటన సందర్భంగా కాన్వాయ్ కోసం అధికారులు ప్రజల వాహనాలను స్వాధీనం చేసుకోవడం ఏమిటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. 

11.రఘురామకృష్ణంరాజు కామెంట్స్

  అవినీతిని సహించని వైసీపీ అధినేత జగన్ చెప్పడం హాస్యాస్పదమని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. 

12.ఏపీ లో రేషన్ బియ్యం అక్రమ రవాణా : సోము వీర్రాజు

 

ఏపీలో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా అవుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. 

13.ఏబీ వెంకటేశ్వరరావు కు సుప్రీం కోర్టులో ఊరట

  సుప్రీం కోర్టులో రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది.రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తెలిపింది. 

14.టీడీపీ అండమాన్ శాఖ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

 

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

టిడిపి అండమాన్ శాఖ నాయకులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

15.టీటీడీ లో చోటుచేసుకున్న ఘటన పై బీజేపీ విమర్శలు

  తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులపై బీజేపీ నేత భానుప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కలియుగ వైకుంఠం లో శ్రీవారి భక్తులకు తొక్కల చూపిస్తున్నారని  భాను ప్రకాష్ విమర్శించారు. 

16.టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

 

Advertisement

టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది.గురువారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 

17.బలబద్రపురం లో జగన్ పర్యటన

   తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలబద్రపురం లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. 

18.ఒంగోలు ఆర్టిఏ అధికారులపై జగన్ ఆగ్రహం

 

ఆర్టీఏ అధికారుల పై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం కాన్వాయ్ కోసం అంటూ తిరుమల వెళ్తున్న భక్తుల కుటుంబాన్ని rp కారు తీసుకువెళ్ళిన ఘటనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు. 

19.ఒంగోలులో బిజెపి మహాధర్నా

  బీజేపీ కార్యకర్తల పై పెట్టిన కేసులకు  నిరసనగా ఒంగోలు లో బిజెపి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. 

20.ఈరోజు బంగారం ధరలు

 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,300   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 53,780.

తాజా వార్తలు