న్యూస్ రౌండప్ టాప్ 20

1.కొత్త సంవత్సరం వేడుకల పై హైకోర్టు ఆగ్రహం

నూతన సంవత్సర వేడుకలకు హైకోర్టు ఇచ్చిన అంశాలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ విషయంపై ప్రభుత్వం అంశాలపై తెలంగాణ హైకోర్టులో బుధవారం పిల్ దాఖలైంది.

2.గవర్నర్ తో ఎంపీ సోయం బాబూరావు భేటీ

గవర్నర్ తమిళ సై తో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు రాజ్ భవన్ లో భేటీ అయ్యారు.

3.చింతల్ బస్తీ లో గవర్నర్ పర్యటన

హైదరాబాద్ లోని చింతల్ బస్తిలో గవర్నర్ తమిళ సై బుధవారం పర్యటించారు.

4.నేడు చెన్నమనేని పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదంపై బుధవారం హైకోర్టు విచారణ జరగనుంది.

5.నేడు నల్గొండ లో సీఎం కేసీఆర్ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటించారు.తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో ఎమ్మెల్యే కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించారు.

6.కార్మికుల పిల్లల విద్యకు ఉపకార వేతనాలు

Advertisement

తెలంగాణలోని కార్మికుల పిల్లల ఉపకార వేతనం దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ఇంచార్జీ కమిషనర్ గంగాధర్ కోరారు.

7.తెలంగాణకు వర్ష సూచన

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

8.జగన్ అక్రమాస్తుల కేసు

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్ల లో మరో నిందితుడు తన పిటిషన్ ను  ఉపసంహరించుకున్నారు.

9.దేవాదుల కింద భూసేకరణపై హైకోర్టు స్టే

దేవాదుల ఎత్తిపోతల పథకం లో భాగంగా చేపడుతున్న నవాబ్ పేట రిజర్వాయర్ ప్రధాన కాలువ కింద భూసేకరణపై స్టే విధిస్తూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా, ఇప్పుడు అన్ని రకాల భూసేకరణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

10.కరెంటు చార్జీలపై ఫిబ్రవరిలో బహిరంగ విచారణ

విద్యుత్ ఛార్జీల పెంపు పై డిస్కంలు దాఖలు చేసిన 2022- 23 వార్షిక ఆదాయ అవసరాలు / టారిఫ్ ప్రతిపాదనపై ఫిబ్రవరి మూడోవారం నుంచి బహిరంగ విచారణ జరపాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించింది.

11.16 వేల మందికి సింగరేణిలో ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 16 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఇందులో ప్రత్యక్ష నియామకాల ద్వారా 3498 మందికి, కారుణ్య నియామకాలు ద్వారా 12,533 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు సింగరేణి సంస్థ తెలిపింది.

12.రఘురామకృష్ణంరాజు కామెంట్స్

ఏపీ సీఎం జగన్ బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టుకు వెళ్తానని వైసీపీ ఎంపీ రఘురామ కష్ణంరాజు ప్రకటించారు.

13.ప్రభుత్వ కాంట్రాక్టర్ల ధర్నా

విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు.

14.ఏపీలో జగనన్న పాలవెల్లువ పథకం ప్రారంభం

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

ఏపీలో జగనన్న పాలవెల్లువ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.

15.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు.

16.ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు

ఏపీలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

17.పెట్రోల్ హోమ్ డెలివరీ విజయవాడలో ప్రారంభం

Advertisement

పెట్రోల్ డీజిల్ హోమ్ డెలివరీ చేసేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమాన్ని ముందుగా విజయవాడలో అందుబాటులోకి తీసుకువచ్చారు.

18.పవన్ కళ్యాణ్ కి సోము వీర్రాజు సూచన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కీలకమైన సూచన చేశారు.ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పోరాటంలో హాఫ్ టీ ఉంటే సరిపోదని, ఫుల్ టీ అవసరం అంటూ వీర్రాజు వ్యాఖ్యానించారు.

19.టీటీడీ కేసు వాదించేందుకు తిరుపతి వచ్చిన సుబ్రమణ్య స్వామి

బీజేపీ నేత రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామి ఈరోజు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు.

టీటీడీ గురించి ప్రముఖ తెలుగు దినపత్రిక పై వంద కోట్ల రూపాయలకు వేసిన పరువు నష్టం దావా కేసు.ఆయన టీటీడీ తరఫున వాదించనున్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర - 47,010 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,199.

తాజా వార్తలు