న్యూస్ రౌండప్ టాప్ 20

1.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 27,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

2.భారత్ లో ఒమి క్రాన్

  భారత్ లో ఒమి క్రాన్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి.ఆదివారం ఉదయం నాటికి భారత్లో లో 1525 ఒమి క్రాన్ కేసులు నమోదు అయ్యాయి. 

3.దేశవ్యాప్తంగా రేపటి నుంచి పిల్లలకు టీకా

  దేశవ్యాప్తంగా రేపటి నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. 

4.రేపు ప్రధాని తో జగన్ భేటీ

  రేపు ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీ తో భేటీ కానున్నారు. 

5.సోము వీర్రాజు విమర్శలు

  ఏపీలో దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతోందని బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. 

6.తెలంగాణలో కరోనా ఆంక్షలు

  తెలంగాణలో కరోనా ఆంక్షలు విధించారు.ర్యాలీలు,  బహిరంగ సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. 

7.నేడు యూపీ లో ప్రధాని పర్యటన

Advertisement

  నేడు ఉత్తరప్రదేశ్  ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. 

8.కేరళలో ఉప రాష్ట్రపతి పర్యటన

  కేరళలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటిస్తున్నారు. 

9.  బండి సంజయ్ జాగరణ దీక్ష

  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ జన జాగరణ దీక్ష ఈ రోజు రాత్రి నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. 

10.ముందస్తు ఎన్నికల పై వైసీపీ ఎంపీ స్పందన

  ఏపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉందని వస్తున్న వార్తలను పూర్తిగా నిరాధారమని అసలు ఆ ఆలోచనే లేదని వైసిపి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. 

11.ప్రజలకు ఢిల్లీ సీఎం సందేశం

  ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా బాధ్యతాయుతంగా ఉండాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. 

12.తెలంగాణలో ముందస్తు ఎన్నికలు : ఉత్తంకుమార్ రెడ్డి

  తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

13.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది నిన్ను నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్వామి వారిని 36,560 మంది దర్శించుకున్నారు. 

14.యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

  యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు రద్దీ బాగా పెరిగింది.ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. 

15.3న డీసెట్ మూడో విడత కౌన్సెలింగ్

  ఈ నెల మూడో తేదీన డీసెట్ మూడో విడత కౌన్సెలింగ్ వరంగల్ లోని హనుమకొండ ఉన్న ప్రభుత్వ డైట్ కళాశాలలో నిర్వహించనున్నారు. 

16.చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు

Advertisement

  చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం సింగ సమురం  పరిసర ప్రాంతాల్లో మూడు ఏనుగుల గుంపు సంచరించడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. 

17.ధార్మిక పరిషత్ కమిటీ పై హై కోర్టులో ఫీల్

  ధార్మిక పరిషత్ కమిటీ  నాలుగు పరిమితం చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.ప్రకాశం జిల్లాకు చెందిన పాలెపు శ్రీనివాసులు ఈ ఫిల్ దాఖలు చేశారు. 

18.మద్ది హామీని నెరవేరుస్తున్నాం : జగన్

  ప్రజలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఉన్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. 

19.మంత్రి బొత్సకు జేసీ పాదాభివందనం

  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ పాదాభివందనం చేయడం వైరల్ గా మారింది. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,120   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,120.

తాజా వార్తలు