న్యూస్ రౌండప్ టాప్ 20 

1.రాజధాని కేసులపై విచారణ

అమరావతి రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

రాజధాని కేసుల నుంచి న్యాయమూర్తులు సత్యనారాయణ మూర్తి స్వామి వ్యాధులను తప్పించాలని ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే పిటిషన్ వేశారు.ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 

2.చెరుకు రైతుల పాదయాత్రను

విజయనగరం జిల్లాలో చెరుకు రైతు మహా పాదయాత్ర చేపట్టారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండడంతో భిమసింగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

3.ప్రభుత్వ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ విమర్శలు

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు .ఎయిడెడ్ విద్యా సంస్థల విలీన నిర్ణయం ను పవన్ తప్పు పట్టారు. 

4.ఏపీ సీఎం జగన్ స్పందన

  తెలుగు రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని రాష్ట్రాన్ని విడగొట్టి ఏళ్లు గడిచినా హామీలు అమలు కావడం లేదని కేంద్రం తీరు ను తప్పు పడుతూ ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. 

5.పోలీసులపై చంద్రబాబు కామెంట్స్

  ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని, ప్రజలు తిరగబడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శలు చేశారు. 

6.తిరుపతి లో బీజేపీ కీలక నేతల సమావేశం

  ఏపీలో బిజెపి పరిస్థితిపై తిరుపతి తాజ్ హోటల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా , బీఎల్ సంతోష్, శివ ప్రకాశ  తదితరులతో  రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ , సుజనా చౌదరి భేటీ అయ్యారు. 

7.కెసిఆర్ పై బండి సంజయ్ కామెంట్స్

Advertisement

  తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు.కేసీఆర్ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడుతారో తెలియదని విమర్శించారు. 

8.మాజీ హోం మంత్రి కి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

  మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు రెండు వారాల జ్యుడిషియల్ కస్టడికి స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్  సోమవారం ఆదేశించింది. 

9.తెలుగు యాత్రికుల కోసం కాశీలో మరో ఆధునిక భవనం

  తెలుగు యాత్రికుల కోసం కాశీలో మరో ఆధునిక భవనం అందుబాటులోకి వచ్చింది.సోమవారం తెల్లవారుజామున 4.05 గంటలకు కాశీ - పాండే హవేలీ లో అఖిల బ్రాహ్మణ కరివెన సత్రం నిర్మించిన నూతన భవనానికి గృహ ప్రవేశం జరిగింది. 

10.ఈటెల రాజేందర్ విమర్శలు

  హుజూరాబాద్ లో ఓటమి తరువాత ప్రజలపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష గట్టింది అని బీజేపీ నేత , ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. 

11.నల్గొండ కు బండి సంజయ్ : టీఆర్ఎస్ ఆందోళన

  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లాలోని ఆర్జల బావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.బండి సంజయ్ గోపి ఎకౌంటు టిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

12.ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది : ఎమ్మెల్యే భూపాల్

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?

  రైతు పండించిన ప్రతిజ్ఞను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. 

13.తెలంగాణలో ఆరోగ్య శాఖ కు పెద్ద పీట

  తెలంగాణలో వైద్య , ఆరోగ్య శాఖ కు సీఎం కేసీఆర్ పెద్ద పేట వేస్తున్నారు అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 

14.ఆదిలాబాద్ లో గవర్నర్ పర్యటన

Advertisement

   తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆదిలాబాద్ జిల్లా పర్యటన రద్దయ్యింది.వాతావరణం అనుకూలించని పోవడంతో హెలికాఫ్టర్ లో ప్రయాణించే వీలు లేకపోవడమే దీనికి కారణం. 

15.సిద్దిపేట జిల్లా కలెక్టర్ రాజీనామా

  తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ కు రాజీనామా చేశారు. 

16.బిర్శా ముండాకు కేసీఆర్ నివాళి

  ఆదివాసీ గిరిజన నాయకుడు , స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం కెసిఆర్ ఆయనకు నివాళులర్పించారు. 

17.ఛత్తీస్ ఘడ్ లో మావోలకు భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు

  ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల కు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఘటనలో మావోయిస్టుల కమాండర్ ఒకరు, భద్రతా దళం లోని కమాండర్ ఒకరు మరణించారు. 

18.కేరళలో భారీ వర్షాలు

కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. 

19.బండి సంజయ్ ను అడ్డుకున్న రైతులు

  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్  నల్గొండ జిల్లా పర్యటనలో రైతుల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,930   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,930.

తాజా వార్తలు