గతంలో ప్రకాష్ రాజ్ కి సంబందించిన ఒక పాత ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు అయన మాట్లాడే మాటలు అన్ని నిజాలే కదా అనిపించాయి.ఆయన ఒక సినిమా నటుడే అయిన, వ్యక్తి జీవితంలో రెండు పెళ్లిళ్లు లాంటి కాంట్రవర్సీలు ఉన్న అయన ఐడియాలజీ బాగుంటుంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నా అనేక మాటలను ప్రకాష్ రాజ్ చాల రోజులుగా చెప్తున్నాడు.వచ్చామా సినిమా చేశామా, లక్షల్లో పారితోషకం తీసుకొని ఇంటికి వెళ్లిపోయామా అని అనుకోకుండా సమాజం, బాధ్యత, రాజకీయం అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడటం చాల ఆశ్చర్యం అనిపించింది.
అయన గెలుపోటములు పక్కనపెడితే అయన మాట్లాడిన మాటలు మీ కోసం.
బాలికల విద్య కోసం దేశంలోని ఇంత మంది రాజకీయనాయకులు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.
స్కూల్స్ లో ఆడపిల్లలకు సరైన వసతులు ఉన్న టాయిలెట్స్ ఉండవు.అందువల్ల వారు నీరు తాగితే ఎక్కడ బాత్ రూమ్ కి వెళ్లాల్సి వస్తుందో అనే భయంతో రోజంతా కూడా మంచి నీళ్లు తాగకుండా టాయిలెట్ కి కూడా వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇంత కన్నా దౌర్భగ్యం ఇంకేం ఉంటుంది.ఇలా ఉండటం వల్ల ఒక పదేళ్ల తర్వాత వారి బాడి లో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి అనే శారీరక సమస్యలను ఎదుర్కొంటారు.వీటి గురించి ఆలోచించడానికి రాజకీయ నాయకులకు సమయం ఉందా ?

ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ వారి వారి నియోజక వర్గాల్లోని స్కూల్స్ లో కూడా టాయిలెట్స్ కట్టించలేకపోతే వారికి ఆ పదవులు ఎందుకు.ఇలాంటి సమస్యలను పక్కన పెట్టి, మతాలు, కులాలు, ధర్మాలు అంటూ మాట్లాడితే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయా ? అంటూ అయన ప్రభుత్వ యంత్రాగాన్ని ప్రశ్నిస్తున్నారు.ఇలా ప్రకాష్ రాజ్ మాట్లాడినప్పుడు నిజంగా చాల ఆశ్చర్యం వేసింది.
ఆయనకు ఇలాంటి సమస్యల పైన అవగాహనా ఉండటం నిజంగా మెచ్చుకొదగ్గ విషయమే.ఇకనైనా రాజకీయాలు మాని స్కూల్స్ లో చదివే బాలికల కోసం పని చేస్తే ఎంత బాగుంటుందో కదా.