Political Parties : రాజకీయ పార్టీల్లో మరో చీకటికోణం

ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన రాజకీయ పార్టీలు అధికారం దాహంతో కొట్టుమిట్టాడుతున్నాయి.గత నాలుగు దశాబ్దాల కాలం నుండి అనూహ్యంగా మారుతూ వస్తున్న రాజకీయ పరిణామాలతో అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు పనిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు కళంకాన్ని తీసుకోస్తున్నాయి .

 Another Dark Side Of Political Parties , Political Parties , Dark Side Of Polit-TeluguStop.com

ప్రధానంగా జాతీయ స్ధాయి రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను కబళించే క్రమంలో చేస్తున్న మకిలి రాజకీయ క్రీడా విన్యాసాలు ఆందోళనకరంగా మారుతున్నాయి .అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రాంతీయ స్ధాయి పార్టీల్లో పెడతుతున్న చిచ్చు అంతాఇంతా కాదు .అధికార దాహంతో సామ్రాజ్య విస్తరణ కోసం కుటుంబాల్లో చిచ్చుపెట్టే కార్యక్రమాలకు తెగబడడం నయా రాజకీయాల్లో పరాకాష్టగా మారింది.

తన కుమార్తె కవిత ను బీజేపీలో చేరమని అడిగారంటే ఇంతకంటే ఘెరం మరోకటి ఉంటుందా అంటూ సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి .మరోవైపు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత కూడా దీనిపై స్పందిస్తూ మహరాష్ట్రాలో షిండే తరహ రాజకీయాలు ఇక్కడ చెల్లవంటూ పార్టీ మార్పుపై ప్రతిపాదనలు వచ్చిన విషయాన్ని అంగీకరించారు.ఈ వ్యాఖ్యలు వెనుక నిజనిజాలు ఏమిటీ ? ఏ సందర్భంలో ఆ బీజేపీ పెద్దలు కేసీఆర్ కుమార్తె కవితకు ఎర వేసారు అనే అంశంపై రకరకాలు కథనాలు వినిపిస్తున్నాయి.ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనల నేపథ్యంలో జరిగిన , జరుగుతున్న పరిణామాల క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్ చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఈ తరహ “విభజించు -పాలించు “అనే తెల్లదొరల సిద్ధాంతాన్ని ఎప్పటి నుండో అమలు చేస్తున్నాయనడంలో సందేహం లేదు .

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు , చక్రం తిప్పుతున్న పార్టీలు ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నాలు తెలుగు నాట పార్టీలకు కొత్తేమికాదు .గతంలో యుపీఏ అధికారంలో ఉండగా తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాలమరణంతో జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీని ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు .కాంగ్రెస్ పార్టీపై ధిక్కారం స్వరం వినిపించడంతో ఆస్తుల కేసు పేరుతో ఆయనను జైలు పాలు చేసారు .ఈ సందర్భంలో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్ కుటుంబంలో పెట్టాలని చూసిన చిచ్చు మర్చిపోలేనిది.స్వయనా జగన్ సోదరి వైఎస్ షర్మిలకు అప్పటి కాంగ్రెస్ పెద్దలు ఎర వేసిన సంఘటనలున్నాయి.జగన్ ను వీడివస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెడతామనే హామీతో పాటు రకరకాల హామీలు కూడా ఇచ్చే ప్రయత్నం ఆనాటి కాంగ్రెస్ పెద్దలు చేసారనేది బహిరంగ రహస్యం .అప్పట్లో జగన్ ను ఏకాకిచేసేందుకు బలంగా ప్రయత్నం చేసిన కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు కొంతమేరకు సఫలమై ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని తమకు అనుకూలంగా మార్చుకొని చివరికి సొంత వదిన విజయమ్మ పైనే పోటీచేయించిన సందర్భం ఇంకా తెలుగు ప్రజల హృదయాల్లో చెరిగిపోలేదు.

Telugu Cm Jagan, Cm Kcr, Congress, Dark, Kavitha, Ysrajasekhar, Ys Sharmila, Ysv

అధికారమే లక్ష్యంతో పనిచేసే పై తరహ ఎత్తుగడలు 2014లో కేంద్రంలో ఎన్డీయే పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆతర్వాత కాంగ్రెస్ పార్టీ కంటే ఒక ఆకు ఎక్కువే చదివి రాజకీయాల్లో ఉండాల్సిన పరిధిలను చెరిపిపడేసింది అనడంలో సందేహం లేదు .ఉత్తరప్రదేశ్ లో తమతో పొత్తులో ఉన్న అప్నాదళ్ లాంటి చిన్న పార్టీలో ఉన్న లుకలుకలను బీజేపీ తనకు అనూకూలంగా మార్చకపోవడంలో సఫలమైంది.అప్నాదళ్ అధినేత సోనేలాల్ చనిపోవడంతో ఆయన సతీమణి కృష్ణ పటేల్ పార్టీ పగ్గాలు చేపట్టారు.

ఈ క్రమంలో తల్లికి , కుమార్తెకు జరిగిన రాజకీయ వైరుధ్యాలను తనకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ .ఆమె కుమార్తెను అనుప్రియాసింగ్ పటేల్ ను ఏకంగా కేంద్రమంత్రి చేసి తల్లికి దూరం చేయడం సంచలనం సృష్టించింది.ఇదేకాకుండా యూపీలోనే సమాజ్ వాదీ పార్టీలో ములాయం కుటుంబంలో తండ్రి , కొడుకు , బాబాయ్ ల మద్య చెలరేగిన వివాదాన్ని , బీహార్ లో లాలూ కుటుంబంలో లుకలుకలను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు బీజేపీ పెద్దలు తహతహలాడారు .కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల తీరు మాదిరిగానే రాష్ట్రాల్లో అధికార పార్టీలు కూడా ఈ రకమైన చర్యలకు పాల్పడటం రాజకీయాల్లో జుగుప్సాకరమైన సందర్భాలు ఇటీవల కాలంలో బలంగా కనిపిస్తున్నాయి.

Telugu Cm Jagan, Cm Kcr, Congress, Dark, Kavitha, Ysrajasekhar, Ys Sharmila, Ysv

అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలోని రాజకీయపార్టీలు అధికారమే పరమావధిగా తమ స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆశాజనకం కాదు .కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ నైతికవిలువలకు తిలోదకాలు ఇచ్చి విభజించు పాలించు సిద్ధాంతాన్ని అవలంభించుకుంటూ పోతే రేపటి రోజున పరిస్ధితులు మారితే తాడే పామై కరిచే ప్రమాదం ఉంది .కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు అధికారం దాహంతో ప్రాంతీయ పార్టీలపై నభయం నలజ్జగా వ్యవహరిస్తే జరిగే పరిణామాలు వారిని కూడా వెంటడే ప్రమాదం ఉంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube