తెలంగాణ రాజకీయాలు మునుపెన్నడూ లేనంతలా కొత్త కొత్త పార్టీలు తెలంగాణలో పుట్టుకొస్తుండటంతో ఇక రాజకీయం రణరంగంగా మారిన పరిస్థితి ఉంది.ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు తోడు వైయస్సార్ సీపీ పార్టీ, బీఎస్పీ పార్టీ , ఆప్ పార్టీ లు ఇప్పుడు తెలంగాణలో కీలక పాత్ర పోషించి చక్రం తిప్పాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
అయితే ఇటు ఈ పార్టీలు అన్నీ ముఖ్యమంత్రి కెసీఆర్ ను టార్గెట్ చేస్తూనే తమ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది.అయితే వైయస్సార్ సీపీ పార్టీ, బీఎస్పీ పార్టీ, ఆప్ పార్టీ లకు క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలం, ప్రజా బలం అనేది లేదన్నది సుస్పష్టం.
కాని ఇప్పుడు కీలక పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ లకు ఇప్పుడు ఈ చిన్న పార్టీలతోనే గుబులు పట్టుకున్నదని చెప్పవచ్చు.
ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎంతో ఈ పార్టీలు తమ సామాజిక వర్గాల ఓట్లను తమ వైపు లాక్కుంటే ఇక పెద్ద ఎత్తున ఓట్లు చీలే అవకాశం ఉంది.
దీంతో కీలక పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది.దీంతో పార్టీల అంచనాలు అన్నీ తలక్రిందులు అయ్యే అవకాశం ఉండడంతో ఇప్పుడు చిన్న చిన్న పార్టీల ప్రభావం కూడా ఎంత మేరకు ఉండవచ్చు అనేది ఇప్పుడు అంతర్గతంగా సర్వేలు చేయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
అయితే అంతగా ప్రభావం ఉంటే ఎలాగైనా సదరు పార్టీలతో చర్చలు జరిపే అవకాశం ఉంటుంది కావున ఆ ఎన్నికల సమయంలో ఎలాంటి పరిణామాలైనా జరిగేందుకు అవకాశం ఉంది కావున రానున్న రోజుల్లో మనకు చిన్న పార్టీలు తెలంగాణ రాజకీయాలపై ఏ మాత్రం ప్రభావం చూపుతాయనేది మనకు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.







