ఇక అనుష్క శర్మ పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా... వీడియో వైరల్!

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సతీమణిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బాలీవుడ్ నటి అనుష్క శర్మ(Anushka Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనుష్క శర్మ పెళ్లి కాకముందు ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ప్రేమలో పడ్డారు.

 Anushaka Sharma Good Bye To Film Industry Video Goes Viral Details, Anushaka Sha-TeluguStop.com

ఇలా రహస్యంగా ప్రేమ ప్రయాణం సాగించిన వీరిద్దరు ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇలా వివాహం తర్వాత ఈ దంపతులు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.

ఇక విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్న తర్వాత అనుష్క శర్మ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

Telugu Anushaka Sharma, Anushka Sharma, Anushkasharma, Bollywood, Heroneanushka,

ఇలా అనుష్క శర్మ హీరోయిన్గా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నిర్మాతగా( Producer ) మాత్రం కొన్ని వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు.అయితే తన కూతురి ఆలనా పాలన చేసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె పూర్తిగా సినిమాలకు దూరమవుతూ వస్తున్నారు.అయితే ప్రస్తుతం అనుష్క శర్మ రెండో బిడ్డకు( Second Baby ) జన్మనివ్వబోతున్నారంటూ కూడా వార్తలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.

అయితే అనుష్క గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై ఎక్కడా కూడా విరాట్ కోహ్లీ కానీ అనుష్క కానీ స్పందించిన దాఖలాలు లేవు.

Telugu Anushaka Sharma, Anushka Sharma, Anushkasharma, Bollywood, Heroneanushka,

ఇదిలా ఉంటే అనుష్కపై మరో గాసిప్ కూడా వినిపిస్తోంది.అనుష్క శర్మ తన రెండో సంతానం తర్వాత నటనకు గుడ్ బై చెబుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.దీనికంతటికి కారణం ఓ పాత వైరల్‌ వీడియో.

పెళ్లికి ముందు అనుష్క శర్మ ఓ మీడియాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది.మీకు పెళ్లి ఎంత ముఖ్యమైనది అనే ప్రశ్న ఈమెకు ఎదురయింది.

ఈ ప్రశ్నకు అనుష్క సమాధానం చెబుతూ నా జీవితంలో నాకు పెళ్లి( Marriage ) అనేది చాలా ముఖ్యం పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత బహుశా సినిమాలలో నటించడం నాకు ఇష్టం ఉండకపోవచ్చు అంటూ ఈమె సమాధానం చెప్పారు.అయితే ప్రస్తుతం ఈమె సినిమాలకు కూడా కాస్త దూరం కావడంతో అభిమానులు ఇదే వీడియోని తిరిగి వైరల్ చేస్తున్నారు.

అనుష్క ఇలాంటి డెసిషన్ తీసుకొని ఇండస్ట్రీకి దూరం అవుతారా అన్న అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.మరి కెరియర్ పరంగా అనుష్క ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube