మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి హుటాహుటిన తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు.గన్ మెన్లు, ఎస్కార్ట్ లేకుండానే హైదరాబాద్ నుంచి పయనమయ్యారు.
ఈ క్రమంలోనే సీఎం సెక్రటరీ ధనుంజయ రెడ్డితో బాలినేని కీలక భేటీ కానున్నారని తెలుస్తోంది.ఒంగోలులో చోటు చేసుకున్న ఫేక్ డాక్యుమెంట్ల స్కాం వ్యవహారం తరువాత బాలినేని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యవహారం నేపథ్యంలోనే బాలినేని తన గన్ మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే.ఈ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాడేపల్లికి బాలినేని ఆకస్మిక పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇందులో భాగంగానే కర్నూలు పర్యటన అనంతరం సీఎం జగన్ తోనూ బాలినేని భేటీ అయ్యే అవకాశం ఉంది.ఈ క్రమంలో జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను వివరించనున్నారని సమాచారం.







