టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆతర్వాత శతమానం భవతి, రాక్షసుడు, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం వంటి పలు సినిమాలలో నటించారు.
ఇప్పటివరకు కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని ఇండస్ట్రీలో దూసుకొస్తున్న అనుపమ పరమేశ్వరన్ రొమాంటిక్ సినిమాలలో కూడా నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇక ప్రస్తుతం ఈమె కార్తికేయ 2, బటర్ ఫ్లై, 18 పేజెస్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
అయితే ఇలా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు అనుకోని షాక్ తగిలింది.
అనుపమ పరమేశ్వరన్ ఫేస్ బుక్ ఖాతా కొన్ని రోజుల క్రితం హ్యాక్ చేశారు.అందులో హ్యాకింగ్ రాయుళ్ల కొన్ని ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటోలను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్న అనుపమ పరమేశ్వరన్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.అయితే ఈ విధమైనటు వంటి మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు కామెంట్ల రూపంలో తనని ఎంతో ఇబ్బంది పెట్టారని అయితే ఆ కామెంట్లపై అనుపమ ఘాటుగా స్పందించడం వల్ల ఇలాంటి కామెంట్స్ రావడం తగ్గిపోయాయని ఓ ఇంటర్వ్యూలో భాగంగా అనుపమ పరమేశ్వరన్ ఈ విషయాన్ని తెలియజేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.