ధన్య బాలకృష్ణ, కోమలి ప్రసాద్, సిద్ది ఇద్నానీ, త్రిధా చౌదరి హీరోయిన్స్‌గా బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ సినిమా మార్చి 6వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి జనాలకు చేరువ అవుతున్న సమయంలో కరోనా మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసేయడం, ఆ తర్వాత లాక్ డౌన్‌తో పూర్తిగా థియేటర్లు తెరుచుకోకుండా అయిన విషయం తెల్సిందే.
థియేటర్ల నుండి ఇప్పుడు అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ చేస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్న జనాలు అమెజాన్‌లో ఈ సినిమాను తెగ చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
నలుగురు ముద్దుగుమ్మలు గోవాకు ఒక పెళ్లి కోసం అని వెళ్లి అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులను సినిమాలో ఆసక్తికరంగా దర్శకుడు బాలు చూపించారు.అమెజాన్‌లో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.