తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.అయోధ్య రామాలయ( Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేతలు రాబోమనడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
అయోధ్య ట్రస్టు ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం సరికాదని కిషన్ రెడ్డి తెలిపారు.గ్రెస్ హిందుత్వ వ్యతిరేక వైఖరిని చాటుకుందని కిషన్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీవి( Congress Party ) ఓటు బ్యాంకు రాజకీయాలని ఆరోపించారు.కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి మరోసారి బయటపడిందని ఎద్దేవా చేశారు.హిందువులకు సంబంధించిన ప్రతి విషయాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్నారు.హిందువులకు కాంగ్రెస్ విలువ ఇవ్వడం లేదని తెలిపారు.ప్రస్తుతం కాంగ్రెస్ అభద్రతాభావంలో ఉందన్న కిషన్ రెడ్డి మన సంస్కృతి, సంప్రదాయాలపై కాంగ్రెస్ కు గౌరవం లేదని విమర్శించారు.