ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ కావడం జరుగుతుంది.ఈ ఏడాది కూడా సంక్రాంతి కానుకగా ఏకంగా నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి.
గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ ( Guntur Karam, Hanuman, Saindhav, Na Samiranga )సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజవుతుండగా ఈ నాలుగు సినిమాల కోసం ఆయా హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాలలో కొన్ని సినిమాల బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉంటే మరికొన్ని సినిమాల బుకింగ్స్ పుంజుకోవాల్సి ఉంది.
సంక్రాంతి రేసులో మొదట హనుమాన్ మూవీ రిలీజవుతుండగా ఈ సినిమా ప్రీమియర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈరోజు సాయంత్రం, సెకండ్ షోలకు కళ్లు చెదిరే స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి.
రేపు కూడా హనుమాన్ మూవీకి బుకింగ్స్ బాగానే ఉన్నా గుంటూరు కారం మూవీ హనుమాన్ బుకింగ్స్ ను డామినేట్ చేస్తోంది.గుంటూరు కారంకు నైజాంలో, ఇతర ఏరియాలలో బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.
సీడెడ్ లో మాత్రం ఈ సినిమా బుకింగ్స్( Movie Bookings ) పుంజుకోవాల్సి ఉంటుంది.సైంధవ్, నా సామిరంగ సినిమాకు బుకింగ్స్ పరవాలేదనే స్థాయిలో ఉన్నాయి.కొన్ని ఏరియాలలో నా సామిరంగ మూవీ బుకింగ్స్ ఇంకా మొదలుకాలేదు.గుంటూరు కారం, హనుమాన్ సినిమాల టాక్ సైంధవ్, నా సామిరంగ సినిమాల కలెక్షన్లు ఆధారపడి ఉంటాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఈ సినిమాలు బాక్సాఫీస్( box office ) వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.నాలుగు సినిమాల బడ్జెట్ 250 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాలకు 220 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.ఈ సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.