టైటిల్: అంతరిక్షంCast & Crew:నటీనటులు: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి తదితరులు దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి నిర్మాత: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్సంగీతం: ప్రశాంత్ విహారి

STORY:
‘మిహిర’ శాటిలైట్ అంతరిక్షంలో దిశను తప్పుతుంది.దీనివల్ల ఎన్నో ప్రమాదాలు జరగనున్నాయి అని ఆంధ్ర ప్రదేశ్ స్పేస్ సెంటర్ లోని సైంటిస్ట్స్ ఆందోళన చెందుతూ ఉంటారు.ఆ సమస్యను పరిష్కరించడానికి దేవ్ (వరుణ్ తేజ్) ని అంతరిక్షంలోకి పంపించడానికి సలహా అడుగుదాము అనుకుంటారు.దేవ్ ని ఒప్పించడానికి రియా (అదితి రావు) ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో అసలు దేవ్ ఎందుకు ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అనేది తెలుసుకుంటుంది.గతంలో దేవ్ కి ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది.
అతను ప్రేమించిన పార్వతి (లావణ్య త్రిపాఠి)కి అతను లాంచ్ చేయాలి అనుకున్న అతని డ్రీం ప్రాజెక్ట్ “విప్రయాన్” కి ఒక సంబంధం ఉంటుంది.
చివరికి అంతరిక్షంలోకి వెళ్లి ‘మిహిర’ శాటిలైట్ సమస్యను పరిష్కరించాలి అనుకుంటాడు దేవ్.
అతనితో కలిసి మరో ముగ్గురు అంతరిక్షంలోకి వెళ్లారు.మిహిర సమస్యను పరిష్కరిస్తారు.
కానీ వెంటనే వెనక్కి తిరిగి రావడానికి నిరాకరిస్తాడు దేవ్.తన డ్రీం ప్రాజెక్ట్ “విప్రయాన్” సమస్యను కూడా పరిష్కరించాలి అనుకుంటాడు.
ఆ క్రమంలో దేవ్ ఆక్సిజన్ సిలిండర్ లో లెవెల్ తగ్గిపోతుంది.చివరికి దేవ్ ఎలా సక్సెస్ అయ్యాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
REVIEW:
వరుణ్ తేజ్ మొదటి నుంచి భిన్నమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు.ఘాజితో సరికొత్త అనుభూతిని అందించిన సంకల్ప్ రెడ్డి అంతరిక్షం చిత్రంతో మరో ప్రయోగం చేస్తున్నాడు.టాలీవుడ్ లో వస్తున్న తొలి స్పేస్ థ్రిల్లర్ కావడంతో ఉత్కంఠ నెలకొని ఉంది.
లావణ్య త్రిపాఠి, అదితి రావు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఫస్టాఫ్ సాదాసీదాగానే ఉంది.పాత్రల పరిచయాలు, వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ, అంతరిక్షంలోకి వెళ్లడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ అయిపోతుంది.మిగతా కథంతా సెకండాఫ్‌లోనే చూపించారు.అంతరిక్షంలోకి వెళ్లిన తరవాత వచ్చే సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ వర్క్ ఊహించిన స్థాయిలో లేదు.
నిర్మాణ విలువలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.‘మిహిర’ శాటిలైట్‌లో సమస్యను పరిష్కరించడానికి చాలా సీరియస్‌గా సాగే మిషన్ ఇది.కాబట్టి ఇలాంటి సినిమాలో కామెడీ, వినోదాన్ని ఆశించడం భావ్యం కాదు.అయితే ఇలాంటి సినిమాలు ప్రేక్షకుడిని ఆ లోకంలోకి తీసుకెళ్లిపోవాలి.కానీ ఈ మిషన్ ఆ విషయంలో సక్సెస్ అవ్వలేదు.
Plus points: స్టోరీ
ఫస్ట్ హాఫ్
Minus points:
సెకండ్ హాఫ్
బోరింగ్ సన్నివేశాలు
vfx
నిర్మాణ విలువలు
Final Verdict:
మిహిర ప్రాజెక్ట్ అయితే సక్సెస్ అయ్యింది…కానీ “అంతరిక్షం” ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రాజెక్ట్ లో విఫలమైంది.కానీ సంకల్ప్ రెడ్డి ప్రయత్నంకి హ్యాట్సాఫ్.