Akkineni Nageswara Rao : అడుక్కుని ఎంపీ అవ్వాలా.. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

మామూలుగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం అన్నది కామన్.ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న విషయం తెలిసిందే.

 Anr Viral Comments On Mp-TeluguStop.com

ముఖ్యమంత్రిగా ఎంపీలుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా కూడా రాణించారు.అదేవిధంగా అధికార పార్టీలు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు మంచి గుర్తింపు ఉన్న సెలబ్రిటీలను ఎంపీలుగా నామినేట్ చేస్తూనే ఉన్నాయి.

అలా ఒకప్పటి నటుడు,హీరో అక్కినేని నాగేశ్వరరావు( ANR )కూడా ఒక దశలో రాజ్యసభ సభ్యుడు కావాల్సిందట.కానీ చిన్న ఇబ్బంది వల్ల అది కుదరలేదు అని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ( Thammareddy Bhardwaj ) తెలిపారు.

తాజాగా ఏఎన్నార్ శతజయంతి నేపథ్యంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Telugu Nageshwara Rao, Tamma Bhardhwaj, Tollywood-Movie

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.ఏఎన్నార్‌కు ఎంపీ కావడం ఇష్టం లేకపోయినా ఆయనకు ఆ పదవి ఇప్పించాలని తాను గట్టిగా ప్రయత్నించినా కూడా వీలు కాలేదు అని తెలిపారు తమ్మా రెడ్డి. ( Thammareddy Bhardwaj ) నాగేశ్వరరావు గారు రాజ్యసభకు వెళ్తే బాగుంటుందని నేను, మరికొంతమంది సినిమా వాళ్లం అనుకున్నాం.

ఇదే విషయాన్ని వెళ్లి ఏఎన్నార్ ‌గారికి ఒకసారి చెప్పాను.ఆయన సీరియస్‌గా లుక్ ఇచ్చి.అంటే ఇప్పడు అక్కినేని ( ANR )వెళ్లి అడుక్కుని ఎంపీ అవ్వాలంటావా అన్నారు.అందుకు నేను అలా కాదు సార్ అంటే.

అక్కర్లేదు.

Telugu Nageshwara Rao, Tamma Bhardhwaj, Tollywood-Movie

నేను ఏ పదవీ అడుక్కుని తెచ్చుకోనక్కర్లేదు అని కుండబద్దలు కొట్టేశారు.నేను ఇక నా ప్రయత్నం నేను చేద్దామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి( Chandrababu Naidu ) గారి దగ్గరికి వెళ్లాను.అప్పట్లో నేను రోజూ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేవాడిని.

ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్లి నాగేశ్వరరావు గారిని రాజ్యసభకు పంపితే సినీ పరిశ్రమకు గర్వకారణంగా ఉంటుంది.ఇండస్ట్రీ తరఫున ఈ విషయం అడుగుతున్నానని చెప్పాను.అప్పుడు గుజ్రాల్‌ గారు ప్రధాని.చంద్రబాబు గారు ఎన్డీఏ సారథి.

ఆయన ఏం చెబితే అది జరిగే పరిస్థితి.అయితే అప్పటికే గుజ్రాల్ గారు షబానా ఆజ్మీకి మాట ఇచ్చారని ఒకేసారి ఇద్దరు నటులను రాజ్యసభకు నామినేట్ చేయడం కుదరదని అలా అడిగినా బాగోదని చెప్పారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube