ఏపీకి మరో తుఫాను గండం..!

ఏపీకి మరో తుఫాను గండం పొంచి ఉంది.ఇటీవల బీభత్సం సృష్టించిన మిగ్జామ్ తుఫాన్ ప్రభావం నుంచి కోలుకోకముందే మరో తుఫాన్ గండం పొంచి ఉంది.

దీంతో ఏపీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఈనెల 16న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.ఇది 18వ తేదీన అల్పపీడనంగా మారనుందని ప్రకటించింది.

ఈ అల్పపీడనం శ్రీలంక, తమిళనాడుతో పాటు ఏపీ వైపుగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.ఈ అల్పపీడనం భారీ తుపానుగా మారనున్న నేపథ్యంలో ఈనెల 21 నుంచి 25 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!
Advertisement

తాజా వార్తలు